ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అనుమతులన్నీ సువిధలోనే!

ABN, Publish Date - Apr 19 , 2024 | 01:53 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరగకుండా ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది.

ఎన్నికల కమిషన్‌ కొత్త పోర్టల్‌

ఆర్‌ఓలకు మాన్యువల్‌గా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

అనకాపల్లి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి):

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరగకుండా ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. సాంకేతికతను జోడించి ఓటింగ్‌ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలు.. నామినేషన్ల దాఖలు నుంచి ర్యాలీలు, ఎన్నికల ప్రచారానికి అనుమతులు, తదితర వాటికి సంబంధించి సువిధ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి 48 గంటల్లో అనుమతులు జారీ చేస్తారు. అన్నిరకాల ప్రచార అనుమతులకు అభ్యర్థులు ముందుగా జ్ట్టిఞట/టఠఠిజీఛీజ్చి.్ఛఛిజీ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు మాన్యువల్‌గా కూడా దరఖాస్తులు చేసుకున్నా అనుమతులు ఇస్తారు.

వీటికి సువిధలో అనుమతులు పొందొచ్చు..

సమావేశాలు, సభలు, ర్యాలీలు, ప్రచార వాహనాలు, తాత్కాలికంగా పార్టీ కార్యాలయాల ఏర్పాటు, ముఖ్యనేతల పర్యటనలకు హెలీప్యాడ్‌ల ఏర్పాటు, ఇంటింటి ప్రచారం, బ్యానర్లు, పార్టీ జెండాలు, ఎయిర్‌ బెలూన్‌లు, వీడియో వ్యాన్‌లు, హోర్డింగ్‌ల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ వంటి వాటి కోసం సువిధ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాల్సి ఉంటుంది. సువిధ పోర్టల్‌ ద్వారా కాకుండా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లో మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకుని 48 గంటల్లో అనుమతులు పొందవచ్చు.

Updated Date - Apr 19 , 2024 | 01:53 AM

Advertising
Advertising