కొట్టుకుపోయిన బ్రిడ్జి
ABN, Publish Date - Sep 10 , 2024 | 10:40 PM
జీకే వీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం వద్ద వరద ఉధృతికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రా, ఒడిశాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జీకే వీధి మండలం చిన్నగంగవరం వద్ద కొట్టుకుపోయిన వంతెన
సీలేరు, సెప్టెంబరు 10: జీకే వీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం వద్ద వరద ఉధృతికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రా, ఒడిశాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధారకొండ నుంచి గంగవరం వీదుగా పెద్ద గంగవరం , పేట్రాయి మీదుగా ఒడిశాలోని పలు గ్రామాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన మార్గం. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వంతెన కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
Updated Date - Sep 10 , 2024 | 10:40 PM