ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఒకే చెట్టుకు 12 రకాల మామిడి కాయలు

ABN, Publish Date - May 23 , 2024 | 01:06 AM

విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బాందేవుపురం గ్రామంలో మాజీ సర్పంచ్‌ సాగి కృష్ణమూర్తిరాజు ఇంటి పెరటిలో ఉన్న మామిడి చెట్టుకు 12 రకాల కాయలు కాశాయి.

పన్నెండు రకాల కాయలు కలిగిన మామిడి చెట్టు

పద్మనాభం, మే 22: విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బాందేవుపురం గ్రామంలో మాజీ సర్పంచ్‌ సాగి కృష్ణమూర్తిరాజు ఇంటి పెరటిలో ఉన్న మామిడి చెట్టుకు 12 రకాల కాయలు కాశాయి. రైతు అయిన ఆయన తన పొలాల్లో పలు రకాల మామిడి చెట్లు పెంచుతున్నారు. ఒకే చెట్టుకు అంటు కట్టే విధానంలో పలు రకాల మామిడి కాయలు కాచేవిధంగా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి, 12 ఏళ్ల క్రితం తన ఇంటి ఆవరణలో పరియా మామిడి మొక్క వేశారు. ఆ మొక్కకు ఏడేళ్ల క్రితం ఏకంగా 12 రకాల అంట్లు కట్టించారు. ఈ విధంగా కట్టించిన అంట్లు సత్ఫలితాలు ఇవ్వడంతో ఆ చెట్టుకు పన్నూరు మామిడి, ఇమాపసంద్‌, చెరుకు రసాలు, సువర్ణ కలశ, బంగినపల్లి, దొండకాయ, సువర్ణరేఖ, కొత్తపల్లి కొబ్బరి, దశేరి తదితర రకాల కాయలు కాస్తున్నాయి. తన ఇంట్లో వినియోగించుకోవడానికి ఈ చెట్టుకు ఈ విధంగా అంట్లు కట్టించినట్టు రైతు కృష్ణమూర్తిరాజు తెలిపారు.

Updated Date - May 23 , 2024 | 01:06 AM

Advertising
Advertising