ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెయిల్‌ కోసం హైకోర్టుకు వాసుదేవరెడ్డి

ABN, Publish Date - Jul 26 , 2024 | 03:34 AM

లిక్కర్‌ గోడౌన్‌ను ఖాళీ చేయాలని బెదిరించారనే ఆరోపణలతో గుడివాడ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌

‘గుడివాడ’ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ గోడౌన్‌ను ఖాళీ చేయాలని బెదిరించారనే ఆరోపణలతో గుడివాడ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లిఖార్జునరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లిక్కర్‌ గోడౌన్‌ లైసెన్స్‌ లీజు ఒప్పందం ముగియక ముందే బలవంతంగా ఖాళీ చేయించి తన తల్లి మరణానికి కారణమయ్యారని పేర్కొంటూ దుగ్గిరాల ప్రభాకర్‌... గుడివాడ రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మాజీమంత్రి కొడాలి నాని, బెవరేజ్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి తదితరుల పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - Jul 26 , 2024 | 07:27 AM

Advertising
Advertising
<