ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

ABN, Publish Date - Nov 20 , 2024 | 04:49 AM

తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది.

తిరుమల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నారు. కాగా, మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు సంబంఽధించి ఎలక్ర్టానిక్‌ డిప్‌ కోటాను టీటీడీ ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వీటిని భక్తులు బుధవారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఇక, అంగ ప్రదక్షిణ టికెట్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.

Updated Date - Nov 20 , 2024 | 04:49 AM