టెర్రరి్‌స్టలా ట్రీట్ చేశారు: నటి జెత్వానీ
ABN, Publish Date - Sep 10 , 2024 | 03:37 AM
గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులు తన పట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరి జెత్వానీ ఆరోపించారు.
పీఎస్‌ఆర్, కాంతిరాణా, గున్నీపై
చర్యలు తీసుకోవాలి: నటి జెత్వానీ
విద్యాసాగర్ బ్లాక్‌మెయిల్ చేశారు
కేసు నమోదు చేయాలని
సీపీని కోరిన మహిళా సంఘాలు
విజయవాడ(ధర్నాచౌక్), సెప్టెంబరు 9: గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులు తన పట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరి జెత్వానీ ఆరోపించారు. తనను ఒక టెర్రరిస్టుగా ట్రీట్ చేశారని, తన క్యారెక్టర్‌ను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసు అధికారులు పీఎ్‌సఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఒక మహిళ పట్ల దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు. అప్పటి పోలీసులు విద్యాసాగర్‌కు కొమ్ముకాశారని ఆరోపించారు. దుబాయ్‌లో ఉన్న తన సోదరుడిని కూడా ఇబ్బంది పెట్టారని చెప్పారు. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. విద్యాసాగర్ తనను బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపించారు. అతనిపై 2015 నాటికే 18 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు తనకు న్యాయం చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - Sep 10 , 2024 | 03:38 AM