ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దళిత మహిళను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:59 PM

ఆదోని మండలం నాగనాఽథనహళ్లి గ్రామంలో దళిత మహిళ అయిన బసివిని గుండమ్మను అగ్రకులస్థులు ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయడం దారుణమని, హంతకులను కఠినంగ శిక్షించాలని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మహదేవ డిమాండ్‌ చేశారు.

గోనెగండ్ల, జూలై 15: ఆదోని మండలం నాగనాఽథనహళ్లి గ్రామంలో దళిత మహిళ అయిన బసివిని గుండమ్మను అగ్రకులస్థులు ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయడం దారుణమని, హంతకులను కఠినంగ శిక్షించాలని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మహదేవ డిమాండ్‌ చేశారు. సోమవారం గోనెగండ్లలో ఆ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అరగంట పాటు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 50లక్షల పరిహరం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌, ఎస్పీ నాగనాఽథనహళ్లి గ్రామాన్ని సందర్శించి దళితులకు మనోధైౖర్యాన్ని ఇవ్వాలని, దాడికి పాల్పడిన అగ్రవర్ణాలకు చెందిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ పార్వతి కి వినతి పత్రం అందజేవారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు నాగేశ్వరావు, మాదన్న, జగన్‌, పవన్‌, పెద్దరంగన్న, మహేష్‌, రంగ, మునిస్వామి, రంగన్న, పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:59 PM

Advertising
Advertising
<