వాల్టాకు తూట్లు.. వృక్షాలకు పోట్లు
ABN, Publish Date - Jul 29 , 2024 | 11:57 PM
వాల్టా చట్టాన్ని అతిక్రమించి అక్రమంగా అడ్డంగా చెట్లను నరికివేసి వాటిని ఇతర ప్రాంతాలలో ఉండే కొయ్యలమండీలకు తరిస్తున్నా పట్టించుకునే నాథుడేకరువయ్యారు.
అక్రమంగా చెట్ల నరికివేత అంతరించిపోతున్న వృక్షసంపద పర్యావరణానికి ముంచుకొస్తున్న పెనుముప్పు
నిమ్మనపల్లి, జూలై 29: వాల్టా చట్టాన్ని అతిక్రమించి అక్రమంగా అడ్డంగా చెట్లను నరికివేసి వాటిని ఇతర ప్రాంతాలలో ఉండే కొయ్యలమండీలకు తరిస్తున్నా పట్టించుకునే నాథుడేకరువయ్యారు. అసలే వృక్ష సంపద నానాటికి తగ్గిపోతూ వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయని నిపుణులు వాపోతున్నారు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు విరివి గా మొక్కలు నాటి అంతరిస్తున్న వృక్ష సంపదను పరిరక్షించాలని చెపు తున్నా చెట్ల నరికివేత మాత్రం తగ్గడంలేదు. నిమ్మనపల్లె మండలంలోని వెంగంవారిపల్లి, తవళం, నిమ్మనపల్లి, కొండయ్యగారిపల్లి పంచాయతీల్లో కొందరు అక్రమంగా చెట్టను నరికివేస్తున్నారు. ముఖ్యంగా పుంగనూరు, మదనపల్లి, వాల్మీకిపురం నుంచి దాదాపు పది మంది కొయ్యలవ్యాపా రం చేస్తూ రైతుల వద్ద నుంచి తక్కువకు వృక్షాలను కొనుగోలు చేసి ఎక్కవ లాభాలకు విక్రయిస్తూ పబ్బంగడుకొంటున్నారు. ఈ తంతు గత మూడు నెలలుగా జరుగుతన్నా పట్టించుకొనే నాధుడు కరువైయ్యాడు. కాగా ఇటీవల నిమ్మనపల్లి, కొండయ్యగారిపల్లిలో చెట్లను నరికి వేసి తర లించేందుకు సిద్ధం అయ్యారు. అంతే కాకుండా తవళం గ్రామ పంచా యతీలో రోజూ రెండు ట్రాక్టర్ల లోడు మొద్దులను ఇతర ప్రాతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. కాగా అటవీశాఖ అధికారులకు ప్రతి నెలా మామూళ్లు అందుతుండడంతోనే ఇలా చెట్ల నరికివేత తరలింపు మూడు చెట్లు అరవై కొమ్మలుగా సాగుతోంది దీని కారణంగా మండలంలో వృక్ష సంపద అంతరించిపోయో ప్రమాదం ఏర్పడింది. వాల్టా చట్టం అంటే సహజవనరులను కాపాడి వాటిని పరిరక్షిచుకోవడమే అని తెలసినా దానిని అతిక్రమించి చెట్లను నరుతున్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు కోరతున్నారు. ఇదిలా ఉండగా ఈ చెట్ల నరికివేత, తరలింపు సంఘటనలపై సంబంధిత అటవీశాఖ అధికారి గార్డు దీపను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా చెట్లు నరుకుతున్నట్లు తమకు దృష్టికిరాలేదని తెలిపారు. అలాం టి వారిపై తప్పకుండా చర్చల తీసుకొంటామన్నారు.
Updated Date - Jul 29 , 2024 | 11:57 PM