ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇదొక అద్భుత అవకాశం

ABN, Publish Date - Aug 24 , 2024 | 05:18 AM

గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన విధ్వంసంతో దారుణంగా దెబ్బతిన్న అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు జవసత్వాలు అందించనుంది.

అమరావతికి ఆర్థిక సాయమే కాదు..సాంకేతిక మద్దతు కూడా అందిస్తాం

ఆంధ్రజ్యోతి’తో ప్రపంచబ్యాంకు ప్రతినిధి సుదీప్‌ మజుందార్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన విధ్వంసంతో దారుణంగా దెబ్బతిన్న అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు జవసత్వాలు అందించనుంది. రాజధానిగా అమరావతి అభివృద్ధి ఒక అద్భుత అవకాశమని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంతం లీడ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సుదీప్‌ మజుందార్‌ శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం మాత్రమే కాదు, సాంకేతిక మద్దతు కూడా అందిస్తామని స్పష్టం చేశారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి వాతావరణానికైనా తట్టుకుని, ఆర్థికంగా సుస్థిరం కాగలిగిన ఒక గ్రీన్‌ ఫీల్డ్‌ నగరాన్ని అభివృద్ధి చేయడం అవసరమని పేర్కొన్నారు. దీనివల్ల ఏపీలోనే కాకుండా.. మొత్తం భారత్‌లోనే ఆర్థిక ప్రగతి పుంజుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకు బృందం అమరావతిని సందర్శించి, కొత్త రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసేందుకు సాంకేతిక, ఆర్థిక మద్దతు అందించే అవకాశాలు అధ్యయనం చేస్తోందని చెప్పారు. ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకు సహకారంతో ప్రపంచంలోని ఇతర నగరాల ప్రాజెక్టుల అనుభవాన్ని, నైపుణ్యాన్ని అమరావతి నిర్మాణంలో వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు. దీనివల్ల ఒక అద్భుత రాజధానిని నిర్మించాలన్న ఆ ప్రభుత్వ బృహత్తర ఆకాంక్షకు సహకరిస్తున్నట్టు తాము భావిస్తున్నామని తెలిపారు. తమ బృందం అమరావతిలో జరిపిన పర్యటన ప్రాథమిక అంచనా కోసమేనని, ఇక్కడ మరిన్ని సార్లు పర్యటించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు పూర్తిచేసిన అనంతరం తమ మద్దతుకు సంబంధించిన అంశాలను ఖరారు చేస్తామని మజుందార్‌ పేర్కొన్నారు. ఇతర భాగస్వాములు, స్థానిక ప్రజలతో కూడా తాము చర్చిస్తామని చెప్పారు.

Updated Date - Aug 24 , 2024 | 05:18 AM

Advertising
Advertising
<