జరిగింది నాలుగు రాజకీయ హత్యలు
ABN, Publish Date - Jul 31 , 2024 | 02:37 AM
రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహించారు.
చనిపోయినవారిలో ముగ్గురు టీడీపీవారే
ఆ వివరాలు ఇవ్వడానికీ మేం సిద్ధం
శాంతిభద్రతలపై జగన్‌వన్నీ అబద్ధాలే: అనిత
విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరిగితే, అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ వారేనన్నారు. ఆ వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ విభాగాధిపతులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. ‘‘రాజకీయ హత్యలపై జగన్ పూటకు ఒక మాట్లాడుతున్నారు. ఢిల్లీ ధర్నా సమయంలో 36 హత్యలు అన్నారు. గవర్నర్‌కు పంపిన లేఖలో 31 మంది హత్యకు గురయ్యారని చెప్పారు. జగన్ ఆరోపణల్లో పస లేదని ఈ పొంతన లేని లెక్కలు చూస్తేనే అర్థమైపోతోంది’’ అని హోంమంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానివెనుక గంజాయి పాత్ర ఉంటోందని అనిత తెలిపారు. గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసేందుకు తానే స్వయంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తానని పేర్కొన్నారు.
Updated Date - Jul 31 , 2024 | 02:38 AM