ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ది లీడర్

ABN, Publish Date - Apr 27 , 2024 | 04:34 AM

ఓసారి ఎమ్మెల్యే అయితేనే.. ఖరీదైన కార్లు, చుట్టూ గన్‌మెన్‌, వందిమాగధులు.. హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది.. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా చాలా సాధారణ జీవితం గడిపేవారు. రైలులో ప్రయాణికులతో కలసి థర్డ్‌ క్లాస్‌లో ప్రయాణించేవారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యే

పెన్షన్‌తోనే బతికారు

ఓసారి ఎమ్మెల్యే అయితేనే.. ఖరీదైన కార్లు, చుట్టూ గన్‌మెన్‌, వందిమాగధులు.. హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది.. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా చాలా సాధారణ జీవితం గడిపేవారు. రైలులో ప్రయాణికులతో కలసి థర్డ్‌ క్లాస్‌లో ప్రయాణించేవారు. జీవితం చివరి దశలో మాజీ ఎమ్మెల్యేగా తనకు వచ్చే పెన్షన్‌పైనే ఆధారపడి జీవనం సాగించారు.

ఆయనే... ఆంధ్రా గాంధీగా, అపర భీష్ముడిగా పేరొందిన పద్మవిభూషణ్‌ వావిలాల గోపాలకృష్ణయ్య.

1906 సెప్టెంబరు 17న సత్తెనపల్లిలో జన్మించారు. స్వరాజ్య భిక్ష పేరుతో ఇంటింటికీ తిరిగి బియ్యం, జొన్నలు సేకరించి వాటితో కార్యకర్తలకు భోజన సదుపాయం కల్పించేవారు. ప్రజాఉద్యమాలే ఊపిరిగా జీవించారు. తెల్లదొరలను ఎదిరించి జైలు జీవితం గడిపారు.

పాత్రికేయుడిగా, రచయితగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా బహుముఖ పాత్రలు పోషించారు. సత్తెనపల్లి నుంచి వావిలాల మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఒక పర్యాయం ఆయన హైదరాబాద్‌ వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసుకుని స్టేషన్‌కు వెళ్లారు. తీరా రైలు ఎక్కేటప్పుడు చూసుకుంటే తాను తీసుకున్న టికెట్‌ మరుసటి రోజుదని గ్రహించారు. ఇది పొరపాటున జరిగింది.

వెంటనే ఆయన ప్రయాణం వాయిదా వేసుకుని, రైలు దిగి స్టేషన్‌ ప్రాంగణం నుంచి బయటకు నడవసాగారు. విషయం తెలుసుకున్న టీసీలు పరుగున వచ్చి.. ‘ఫస్ట్‌ ఏసీలో ఖాళీలు ఉన్నాయి.

మీరు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేస్తాం’ అని విజ్ఞప్తి చేశారు. అయితే వావిలాల సున్నితంగా తిరస్కరించి వెనక్కి వచ్చేశారు.

90 ఏళ్ల వయసులో కూడాఉద్యమాల పేరుతో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా ఆయన విస్తృతంగా పర్యటించేవారు. చివరి శ్వాస వరకు సమాజ హితం కోసం పరితపిస్తూ, కుటుంబ బాంధవ్యాలకు దూరంగా ఉంటూ 2003 ఏప్రిల్‌ 29న బ్రహ్మచారిగానే తనువు చాలించారు.

-గుంటూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 27 , 2024 | 04:36 AM

Advertising
Advertising