ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మికుల క్షేమం, సంక్షేమమే ధ్యేయం

ABN, Publish Date - Aug 30 , 2024 | 04:26 AM

సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది’

వారి సేఫ్టీ విషయంలో రాజీ వద్దు

భద్రతపై థర్డ్‌ పార్టీ ఆడిట్‌ తప్పనిసరి

ఈఎ్‌సఐను బలోపేతం చేయాలి: బాబు

కార్మిక, పరిశ్రమలు, బాయిలర్స్‌, మెడికల్‌ సర్వీసెస్‌ శాఖలపై సమీక్ష

అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ‘సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్‌, మెడికల్‌ సర్వీసెస్‌ శాఖలపై గురువారం ఉదయం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ‘కార్మికుల సంక్షేమ విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్దిష్ట ప్రణాళితతో ముందుకెళ్లాలి. సేఫ్టీ విషయంలో పరిశ్రమలు రాజీ పడకూడదు. భద్రతా ప్రమాణాలపై థర్డ్‌ పార్టీ ఆడిట్‌ తప్పనిసరి చేయాలి. తనిఖీలు... భద్రత పెంచేలా, తప్పులు సరిదిద్దేలా ఉండాలి. అంతేకానీ ఆ పేరుతో పరిశ్రమల యాజమాన్యాలను వేధింపులకు గురి చేయవద్దు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత మళ్లీ సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేదు. ఇలా కాకుండా నిర్దిష్ట ప్రణాళికతో భద్రత కోసం పనిచేయాలి. తనిఖీలతో పాటు థర్డ్‌ పార్టీ ద్వారా కూడా ఆడిట్‌ జరపాల్సిన అవసరం ఉంది. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలకు అనుమతుల జారీ విషయంలో పారదర్శకంగా పని చేయాలి’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 24,642 ఫ్యాక్టరీలు రిజిస్టర్‌ అయ్యాయని వాటిలో 11.78 లక్షల మంది పని చేస్తున్నారని అధికారులు వివరించారు. రాష్ట్రంలో రసాయన పరిశ్రమలు పెరిగిన దృష్ట్యా భద్రతా చర్యలు పర్యవేక్షించడానికి, ప్రమాదాలు అరికట్టడానికి ముగ్గురు కెమికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఉండాలన్నారు. పరిశ్రమల్లో తనిఖీలకు అవసరమైన అధికారులను వెంటనే నియమిస్తామని ఈ మేరకు పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

నాలుగు ఆసుపత్రులను బలోపేతం చేయాలి

మన రాష్ట్రంలో ఉన్న నాలుగు ఈఎ్‌సఐ ఆస్పత్రులను బలోపేతం చేయాలని సీఎం సూచించారు. 2014-19 మధ్య ఈఎ్‌సఐ వైద్య సేవలు పొందే వారి సంఖ్య 5 నుంచి 11 లక్షలకు పెరిగితే.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఈఎ్‌సఐ సేవలు తగ్గాయని మంత్రి వాసంశెట్టి సుభాష్‌, సీఎంకు వివరించారు. వైఎ్‌సఆర్‌ బీమాలో జరిగిన అక్రమాలను సీఎంకు వివరించారు. పేదలకు అందే సాయంలోనూ అక్రమాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించకూడదని, తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈఎ్‌సఐ ఆసుపత్రులకు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.54 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెప్పగానే సీఎం స్పందించి వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ‘నాడు సహజ మరణాలకు రూ.2 లక్షలు, ప్రమాద మరణాలకు రూ.5 లక్షలు ఇచ్చాం. కానీ వైసీపీ ప్రభుత్వం సహజ మరణాలకు కేవలం రూ.1 లక్ష ఇచ్చి చేతుల దులుపుకుంది. టీడీపీ హయాంలో సహజ మరణం పొందిన 3 లక్షల మందికి రూ.3,393 కోట్లు చెల్లించగా, గత ప్రభుత్వం కేవలం 91 వేల మందికి రూ.1,025 కోట్లు మాత్రమే చెల్లించింది. చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు ఇస్తామనే ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నాం. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.

Updated Date - Aug 30 , 2024 | 04:26 AM

Advertising
Advertising