ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫేక్‌ డాక్యుమెంట్ల సృష్టికర్త తమ్మినేని

ABN, Publish Date - Aug 24 , 2024 | 05:11 AM

ఫేక్‌ డిగ్రీ సర్టిఫికెట్లే కాదు.. ఆస్తులకూ ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించడం ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకి అలవాటే’ అని టీడీపీ ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ విమర్శించారు.

ఇతరుల ఆస్తులకూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు

ఆయన ఫేక్‌ డిగ్రీని అంబేడ్కర్‌, ఉస్మానియా వర్సిటీలు ధ్రువీకరించాయి

మాజీ స్పీకర్‌ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు చేయాలి: కూన రవికుమార్‌

అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ‘ఫేక్‌ డిగ్రీ సర్టిఫికెట్లే కాదు.. ఆస్తులకూ ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించడం ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకి అలవాటే’ అని టీడీపీ ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ విమర్శించారు. శుక్రవారం అమరావతి అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ్మినేని సీతారాంపై సంచలన ఆరోపణలు చేశారు. తమ్మినేని అక్రమాలపై దర్యాప్తు కోసం స్పెషల్‌ టీం వేయాలని సీఎం చంద్రబాబును కోరతానన్నారు. సీతారాం ఫేక్‌ డిగ్రీ సర్టిఫికెట్లపై తాను 2022లోనే మాట్లాడానన్నారు. స్పీకర్‌గా విలువలతో వ్యవహరించాల్సిన వ్యక్తి.. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ఫేక్‌ డిగ్రీ సర్టిఫికెట్ల ఆధారంగా హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ లా కాలేజీలో అడ్మిషన్‌ తీసుకున్నారన్నారు. ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో ఎక్కడా డిగ్రీ పట్టా పొందినట్టు పేర్కొనలేదన్నారు. ఇంటరే తన హయ్యెస్ట్‌ క్వాలిఫికేషన్‌ అని చెప్పారన్నారు. అయితే 2018లో అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందానని ఫేక్‌ సర్టిఫికెట్‌ తయారు చేశారన్నారు. ఆర్టీఐ యాక్ట్‌ ద్వారా ఆ యూనివర్శిటీని అడిగితే ఆయన డిగ్రీ సర్టిఫికెట్‌లో పేర్కొన్న రిజిస్టర్‌ నంబర్‌తోగానీ, పరీక్ష రాసినట్టు పేర్కొన్న సెంటర్‌ నంబర్‌లోగాని సీతారాం పరీక్ష రాయలేదని తెలిపారన్నారు. ఆయన దొంగ సర్టిఫికెట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఫేక్‌ సర్టిఫికెట్లపై రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్‌, ఏపీ గవర్నర్లకు ఫిర్యాదు చేశానన్నారు. ఆనాటి సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. హైకోర్టు సీజేకూ ఫిర్యాదు చేశానని అయితే ఎవరి దగ్గరి నుంచి స్పందన రాలేదని, రాష్ట్రపతి కార్యాలయం నుంచి రిప్లయ్‌ వచ్చిందన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎ్‌సకు పంపారన్నారు. తమ్మినేని ఫేక్‌ డిగ్రీ వ్యవహారాన్ని అంబేడ్కర్‌, ఉస్మానియా యూనివర్శిటీలు ధ్రువీకరించాయన్నారు. తమ్మినేని ఫేక్‌ డిగ్రీపై సీఐడీతో విచారణ జరిపించాలని, దీనిపై త్వరలోనే సీఐడీ చీఫ్‌ను కలుస్తానని చెప్పారు. సీఎస్‌ విచారించి చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. నాగావళి నదిలో ఒక మిషన్‌తో టాంపర్డ్‌ వే బిల్లులు సృష్టించి, ఇసుక తవ్వకాల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని తెలిపారు. తమ్మినేని సీతారాంకు ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించడం అలవాటేనని,. ఆమదాలవలసలో ఒక స్థలానికి చనిపోయిన వ్యక్తి పేరుతో ఫేక్‌ డాక్యుమెంట్‌ సృష్టించి, కోర్టులో వేస్తే, ఫేక్‌ డాక్యుమెంట్‌ సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పిందన్నారు. మరో 16,17 ఇతరుల ఆస్తులపైనా తమ్మినేని ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించారని, దీనిపై శ్రీకాకుళంలోని వివిధ కోర్లుల్లో కేసులు నడుస్తున్నాయని తెలిపారు. ఆయన సభ్య సమాజంలో కూడా ఉండడానికి అనర్హుడన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 07:31 AM

Advertising
Advertising
<