తాడిమర్రి పీహెచసీకి గుర్తింపు
ABN, Publish Date - Jul 15 , 2024 | 11:40 PM
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని(పీహెచసీ)కి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది. జాతీయ క్వాలిటీ సర్టిఫికేషన సంస్థ నిర్వహించిన సర్వేలో తాడిమర్రి పీహెచసీ ఏకంగా 84 పాయింట్లలో రాష్ట్రంలోనే మెరుగైన ప్రభుత్వ వైద్యశాలల జాబితాలో ఏడో స్థానం దక్కించుకుంది.
తాడిమర్రి, జూలై 15: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని(పీహెచసీ)కి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది. జాతీయ క్వాలిటీ సర్టిఫికేషన సంస్థ నిర్వహించిన సర్వేలో తాడిమర్రి పీహెచసీ ఏకంగా 84 పాయింట్లలో రాష్ట్రంలోనే మెరుగైన ప్రభుత్వ వైద్యశాలల జాబితాలో ఏడో స్థానం దక్కించుకుంది. జాతీయ ఆరోగ్య మిషన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాత్సవ ఈనెల 15న తాడిమర్రి సర్టిఫికెట్ పంపిణీ చేశారు. పరిసరాల పరిశుభ్రత, వైద్య పరికరాల నాణ్యత, సర్జరీలు చేయడంలో నైపుణ్యత, మందుల పంపిణీ, వైద్యసేవల తీరుపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే చేపట్టింది. అందులో తాడిమర్రి పీహెచసీని ఎంపిక చేసింది. పీహెచసీకి సర్టిఫికెట్ అందిన నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు. జిల్లా ఉప వైద్యాధికారి సెల్వియా సాల్మన ఆధ్వర్యంలో పీహెచసీలో కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు. స్థానిక వైద్యులు, సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో వైద్యాధికారి హరిత, గోవర్దననాయుడు, కంటి వైద్యనిపుణుడు ఉరుకుందప్ప, సీహెచఓ హేమలత, సూపర్‌వైజర్ రాంకుమార్ పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2024 | 11:40 PM