ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆదివారం.. అమ్మవారి జాతర్లు

ABN, Publish Date - May 26 , 2024 | 11:55 PM

ఆదివారం వచ్చిందంటే చాలు గ్రామాల్లో గ్రామ దేవత ల జాతర్లు వైభవంగా జరుగుతాయి.

పీలేరు: కేవీపల్లెలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న భక్తులు

ఫకేవీపల్లెలో యల్లమ్మతల్లి , వాల్మీకిపురంలో నల్లవీరగంగాభవాని జాతర ఫ గుర్రంకొండలో శిలోమాతమ్మకు బోనాలు

పీలేరు, మే 26:ఆదివారం వచ్చిందంటే చాలు గ్రామాల్లో గ్రామ దేవత ల జాతర్లు వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా ఉగాది శ్రీరామ నవ మి పండుగల తర్వాత ఆయా గ్రామాల్లో జాతర్లు నిర్వహించడం ఆన వాయితీ. ఇందులో భాగంగా కేవీపల్లె మండల ప్రజల ఇష్టదైవమైన యల్లమ్మ తల్లి జాతర ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతరలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, అర్చ నలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి విశేషాలంకరణ చేసి పుష్పపల్లకిలో ఉంచి మంగళవాయిద్యాల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా వస్తున్న చింతమాకులపల్లె నాయునివారు వంశస్థులు తొలి బోనం సమర్పించిన తరువాత మిగిలిన భక్తులు బోనాలు సమర్పించుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆల య కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు. యల్లమ్మ తల్లి జాతరలో భాగంగా మొక్కులు తీర్చుకునే క్రమంలో 26 మంది భక్తులు ఆదివారం రాత్రి చాందినీ బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. కాగా పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ జంగంపల్లె వద్ద వెలసిన అంకాళమ్మ జాతర ఆదివారం వైభవంగా జరిగింది. రెండు రోజులపా టు జరిగిన జాతర ఆదివారం ముగిసింది. భక్తులు ఏర్పాటు చేసిన చాందినీ బండ్లు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వాల్మీకిపురంలో: వాల్మీకిపురం పట్టణంలో ఆదివారం గంగజాతర మహోత్సవాలు వైభవంగా సాగాయి. పట్టణంలోని అమ్మవారి దేవాల యాలలో ఉత్సవాలతో ఊరంతా జాతర వైభవం విశేషంగా సాగింది. స్థానిక వానరగుట్ట ప్రాంతంలోని నల్లవీరగం గాభవానీ అమ్మవారి ఆల యంలో వేకువజాము నుంచి అభిషేకం, అర్చన, తోమాలసేవలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మాలధారణ చేసిన మహి ళలు జలకళశాలతో ఊరేగింపుగా బయలు దేరి స్థానిక పట్టాభిరా మాలయం వద్ద పూజల అనంతరం బజారువీధి, నాయక్‌వీఽధులలోని గంగరాళ్లకు జలాభిషేకాలు నిర్వహించారు. జాతర సందర్భంగా విశేష సంఖ్యలో మహిళలు చలిపిండి దీపారాధనలతో ప్రదర్శనగా బయలుదే రి అమ్మవారి ఆలయానికి చేరుకుని దీలు బోనాలు సమర్పించి మొ క్కులు తీర్చుకున్నారు. అలాగే స్థానిక బైపాస్‌ రోడ్డులోని గంగమ్మ దేవా లయం, రామ్‌నగర్‌లోని నల్లవీరగంగమ్మ ఆలయాలల్లో కూడా జాతర మహోత్సవాలు వైభవంగా సాగాయి. ఈసం దర్భంగా ఆల యాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల వేషధారణలు ప్రత్యేకంగా నిలిచా యి. చివరగా రాత్రికి సింహవాహనంపై నల్లవీ రగంగాభవా నీ అమ్మ వారి నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. కార్యక్రమాలలో ధర్మ కర్త రమణారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన రామ్‌కు మార్‌రెడ్డి, సభ్యులు ఆనందశెట్టి, జేకేబలరామ్‌, అర్చకుడు జనార్దనస్వామి పాల్గొన్నారు.

వైభవంగా శిలోమాతమ్మకు బోనాలు

గుర్రంకొండ, మే 26:గుర్రంకొండ కోటలో వెలిసిన శిలోమాతమ్మకు ఆది వారం మహిళలు బోనాలను సమర్పించారు. గుర్రంకొండ పోలేరమ్మ తిరుణాల సందర్భంగా మొదటి రోజు కోటలో అమ్మవారికి గ్రామంలో ని మహిళలందరూ కలిసి దీలు, బోనాలను తలపై పెట్టుకుని కోట వద్దకు చేరుకున్నారు. కోటలో శిలోమాతమ్మకు ప్రత్యేక పూజలను చేసి కొబ్బరి కాయలు, బోనాలను సమర్పించారు. అనంతరం కొత్తపేటలో కొలువైన పోలేరమ్మకు మహిళలు బోణాలను మొక్కుగా చెల్లించారు. తిరుణాల సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

వేడుకగా దొడ్డిపల్లెమ్మ జాతర

కలకడ, మే 26:మండలంలోని కే.దొడ్డిపల్లెలో కొలువైన దొడ్డిపల్లెమ్మ జాతరను గ్రామస్థులు వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శని వారం రాత్రి నుంచి ఆదివారం వేకుజాము వరకు చాందినీ బండిని రంగు రంగుల విద్యుత దీపాలతో అలంకరించి పురవీధుల్లో ఊరేగిం చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. మహిళలు కుటుంబ సమేతంగా బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - May 26 , 2024 | 11:55 PM

Advertising
Advertising