ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గోడల మధ్య ఇరుక్కుని...

ABN, Publish Date - Apr 16 , 2024 | 03:18 AM

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆవులతిప్పాయపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి అవంతి ఆడుకుంటూ వెళ్లి రెండుగోడల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక

ఆడుకుంటూ ప్రమాదం బారిన పడిన చిన్నారి

రెండు గంటలు శ్రమించి రక్షించిన రెస్క్యూ టీం

తాడిపత్రి టౌన్‌, ఏప్రిల్‌ 15: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆవులతిప్పాయపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి అవంతి ఆడుకుంటూ వెళ్లి రెండుగోడల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక విలవిల్లాడిపోయింది. చివరికి చిన్నారిని పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సుమారు రెండు గంటలపాటు శ్రమించి రక్షించారు. గ్రామానికి చెందిన గంగరాజు కూతురు అవంతి రెండో తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత సోమవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటూ, ఇరుకుగా ఉన్న రెండుగోడల మధ్యకు దూరి ఇరుక్కుపోయింది. సుమారు అరగంట తర్వాత స్థానికులు గమనించి, తండ్రికి, పోలీసు, అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. రూరల్‌ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఫైర్‌ అధికారి మోహన్‌బాబు సిబ్బందితో వెంటనే గ్రామానికి వెళ్లారు. చిన్నారిని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో గ్యాస్‌ కట్టర్‌ ద్వారా గోడను కట్‌చేసి చిన్నారిని బయటకు తీశారు. చిన్నారి క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 03:18 AM

Advertising
Advertising