ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: జగన్‌పై రాయిదాడి కేసు రిమాండ్ రిపోర్ట్‌ వచ్చేసింది.. పోలీసులు ఏం తేల్చారంటే?

ABN, Publish Date - Apr 18 , 2024 | 05:43 PM

జగన్‌పై రాయిదాడి కేసు రిమాండ్ రిపోర్టు బయటకొచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ‘‘ మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హాని చేయాలనే ఉద్దేశ్యంతో రాయి విసిరారు అని వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. నేరం తీవ్రతను బట్టి హత్యాయత్నంగా కేసు నమోదు చేశాం. ప్రాంతాన్ని పరిశీలన చేసి.. 12 మంది సాక్షుల తగుసీ వాంగ్మూలాలను నమోదు చేశాం’’ అని పేర్కొన్నారు.

విజయవాడ: జగన్‌పై రాయిదాడి కేసు రిమాండ్ రిపోర్టు బయటకొచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ‘‘ మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హాని చేయాలనే ఉద్దేశ్యంతో రాయి విసిరారు అని వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. నేరం తీవ్రతను బట్టి హత్యాయత్నంగా కేసు నమోదు చేశాం. ప్రాంతాన్ని పరిశీలన చేసి.. 12 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశాం’’ అని పేర్కొన్నారు.


‘‘ సీసీ ఫుటేజీలు, వీడియోగ్రాఫ్ సేకరించి పరిశీలించాం. ఏప్రిల్ 17న విశ్వసనీయ సమాచారం అందింది. విజయవాడ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్‌ను అరెస్టు చేశాం. మధ్యవర్తుల సమక్షంలో అతడి సెల్‌ఫోన్, బట్టలు స్వాధీనం చేసుకున్నాం. ఏ-1 (మైనర్)ను ఏ-2 వేముల దుర్గారావు ప్రేరేపించాడు. సీఎంను హతమార్చడానికి పదునైన కాంక్రీట్ రాయిని విసిరాడు. జనం మధ్యలోనే ఉండి రాయిని విసిరి.. నడుస్తూనే సత్తీశ్ వెళ్లిపోయాడు. కుట్రతో ముందస్తు ఒప్పందం ప్రకారం గురి పెట్టి మరీ జగన్ తలపైకి బలంగా రాయిని విసిరారు. అదృష్టవశాత్తూ సీఎం గాయంతో బయట పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా బలంగా దెబ్బ తగిలింది. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన తర్వాతే ఏ-1గా మైనర్, ఏ-2గా దుర్గారావు పేర్లను చేర్చాం’’ అని కోర్టుకు రిమాండ్ రిపోర్టు ద్వారా పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

AP Elections: నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ పరిస్థితి ఏంటో తెలుసా?

AP Election 2024: ఆ వార్తలు సాక్షిలో ఎలా వచ్చాయి.. సీఎం జగన్‌పై వర్లరామయ్య ఫైర్

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 06:53 PM

Advertising
Advertising