రాజమహేంద్రవరంలో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ
ABN, Publish Date - Dec 16 , 2024 | 05:56 AM
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు సెంటర్లో శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్..
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు సెంటర్లో శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. రాత్రి జరిగిన వెన్నుదన్ను సభలో శెట్టిబలిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా కుడుపూడి సత్తిబాబు, 15 మంది సభ్యులతో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రమాణం చేయించారు. సభలో మంత్రి సుభాష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రసంగించారు. శెట్టిబలిజ, గౌడ, శ్రీయన, ఈడిగ కులాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. గీత కులాల అభివృద్ధికి కార్పొరేషన్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతి ప్రయోజనాలను కాపాడతానని చైర్మన్ సత్తిబాబు హామీనిచ్చారు.
Updated Date - Dec 16 , 2024 | 05:57 AM