ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి ప్రభుత్వంలో ఉద్దానం కిడ్నీ ఆసుపత్రికి మహర్దశ

ABN, Publish Date - Jul 02 , 2024 | 11:50 PM

పలాస కిడ్నీ ఆసుపత్రి, పరిశోధన కేంద్రానికి మహర్దశ తీసుకువస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు.

రోగులకు అందిస్తున్న సేవలపై వైద్యాధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిరీష

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస: పలాస కిడ్నీ ఆసుపత్రి, పరిశోధన కేంద్రానికి మహర్దశ తీసుకువస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. మంగళ వారం పద్మనాభపురం గ్రామం వద్ద ఉన్న కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందించే సేవలను పరిశీలించారు. 2018 నవంబరు 5న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసుపత్రి నిర్మాణానికి వేసిన శిలాఫలకాన్ని ఆమె ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కిడ్నీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టింది తప్ప ఎటువంటి సదుపాయాలు కల్పించకుండానే ప్రారంభించారని దుయ్యబట్టారు. కూటమి ప్రభు త్వం వచ్చిన నేపథ్యంలో కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసు పత్రికి పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించి వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తామన్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు జరుగుతాయని, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హయాంలో ఇది పూర్తవుతుం దన్నారు. అనంతరం వైద్యాధి కారులతో సమీక్షించి వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆమె వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అల్లు పద్మజ, డీన్‌ కె.మోహన్‌బాబు, టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు యాదవ్‌, గాలి కృష్ణారావు, పీరుకట్ల విఠల్‌రావు, టంకాల రవి శంకర్‌ గుప్తా, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, మల్లా శ్రీనివాస్‌, గురిటి సూర్యనారాయణ, జోగ మల్లి పాల్గొన్నారు.

ప్రభుత్వ టౌన్‌షిప్‌పై ఎమ్మెల్యే సమీక్ష

పలాస: స్థానిక జాతీయరహదారి బొడ్డపాడు వద్ద సుడా లే అవుట్‌పై ఇంజనీరింగ్‌ అధికారులతో ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళ వారం తన చాంబర్‌లో సమీక్షించారు. సుడా వైస్‌ చైర్మన్‌ ఓబులేసు, ప్లానింగ్‌ అధికారి టీజీ రామ్మోహన్‌, జిల్లా టౌన్‌ప్లానింగ్‌ అధికారి కిషోర్‌ కుమార్‌, పబ్లిక్‌హెల్త్‌ ఈఈ సుగుణాకర్‌ ప్లాన్‌ వివరాలను వివరించారు. నిబంధనల ప్రకారం ఫ్లాట్లుగా విభజించి కేటాయిం చడం జరుగుతుందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. రైతులందరికీ నష్టపరిహారం చెల్లించి స్థలాలు సేకరించారా లేదా అని ప్రశ్నించారు. భూమి చదు ను కోసం ఎంత మేరకు నిధులు వెచ్చిస్తురు, ఆ ప్రాంతంలో ఇంకా ప్రభుత్వ నిర్మాణాలు చేస్తారా లేదా, రహదారులు వెడల్పు తది తర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలాస పార్టీ ఇన్‌ చార్జి యార్లగడ్డ వెంకన్నచౌదరి, పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామే శ్వరరావుయాదవ్‌, గాలి కృష్ణారావు, ఎం.నరేంద్ర(చిన్ని) పాల్గొన్నారు.

క్రీడాకారుడికి ఎమ్మెల్యే అభినందన

వజ్రపుకొత్తూరు: మన ప్రాంతానికి మరింత పేరును తీసుకు వచ్చేలా క్రికెట్‌ ఆటను కొనసాగించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నా రు. రామకృష్ణాపురానికి చెందిన దున్న వెంకటేశ్వరరావు బ్లైండ్‌ క్రికెట్‌ టీంకు ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ మంగళ వారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే అభినం దించారు. మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. కార్యక్ర మంలో మాజీ సర్పంచ్‌లు గోవింద పాపారావు, దున్న షన్ముఖరావు, చింత నారాయణ పాల్గొన్నారు. రేషన్‌ డీలర్ల సంఘం నేతలు తవి టయ్య, కామేశ్వరరావు ఎమ్మెల్యే శిరీషని కలిసి అభింనందించారు.

ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించండి

హరిపురం: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మందస మండలం యూటీఎఫ్‌ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళ వారం ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిసి సమస్యలను వివరించి వినతిపత్రం అందించారు. పెండింగ్‌లోని సమస్యలను ప్రాధాన్యతా పరంగా పరిష్కారా నికి కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ.. సమస్యలన్నింటినీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషిచేస్తా మన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయ కులు గుంట కోదండరావు, గున్న రమేష్‌, జగదీష్‌ బడిత్య, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2024 | 11:50 PM

Advertising
Advertising