తొలి మహిళా స్పీకర్ ప్రతిభాభారతి
ABN, Publish Date - Apr 21 , 2024 | 11:36 PM
టీడీపీలో గుర్తింపు పొందిన నాయకుల్లో ప్రతిభా భారతి ఒకరు. మంత్రిగా, శాసనసభ తొలి మహిళా స్పీకర్‌గా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు ప్రతిభాభారతి టీడీపీలో చేరారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా ఎచ్చెర్ల ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 1983 తొలి ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో తొలి ఫలితం ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచే వచ్చింది. ఆ సమయంలో ప్రతిభాభారతి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. దీన్ని సెంటిమెంట్‌గా భావించిన ఎన్టీఆర్ ఆమెను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పట్లో కేబినెట్‌లో ఉన్న ఏకైక మహిళా మంత్రి కూడా ప్రతిభా భారతి కావడం మరో విశేషం. ఎన్టీఆర్ కేబినెట్‌లో రెండుసార్లు ఆమెకు చోటుదక్కింది. 1995లో చంద్రబాబు తన కేబినెట్‌లోకి ప్రతిభాభారతిని తీసుకుని విద్యాశాఖను కేటాయించారు. 1999లో ఆమెకు స్పీకర్‌గా చోటుకల్పించారు. దీంతో రాష్ట్రంలోనే తొలి మహిళా స్పీకర్‌గా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
రణస్థలం: టీడీపీలో గుర్తింపు పొందిన నాయకుల్లో ప్రతిభా భారతి ఒకరు. మంత్రిగా, శాసనసభ తొలి మహిళా స్పీకర్‌గా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు ప్రతిభాభారతి టీడీపీలో చేరారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా ఎచ్చెర్ల ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 1983 తొలి ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో తొలి ఫలితం ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచే వచ్చింది. ఆ సమయంలో ప్రతిభాభారతి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. దీన్ని సెంటిమెంట్‌గా భావించిన ఎన్టీఆర్ ఆమెను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పట్లో కేబినెట్‌లో ఉన్న ఏకైక మహిళా మంత్రి కూడా ప్రతిభా భారతి కావడం మరో విశేషం. ఎన్టీఆర్ కేబినెట్‌లో రెండుసార్లు ఆమెకు చోటుదక్కింది. 1995లో చంద్రబాబు తన కేబినెట్‌లోకి ప్రతిభాభారతిని తీసుకుని విద్యాశాఖను కేటాయించారు. 1999లో ఆమెకు స్పీకర్‌గా చోటుకల్పించారు. దీంతో రాష్ట్రంలోనే తొలి మహిళా స్పీకర్‌గా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
Updated Date - Apr 21 , 2024 | 11:36 PM