ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గజ వాహనంపై శ్రీనివాసుడు

ABN, Publish Date - May 26 , 2024 | 11:33 PM

స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వారం రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుడు గజవాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు.

నరసన్నపేట: గజవాహనంపై ఊరేగుతున్న శ్రీనివాసుడు

నరసన్నపేట: స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వారం రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుడు గజవాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై ప్రత్యేక పూజలు, అభిషేకాలను ఆలయ ప్రధాన అర్చకుడు చామర్తి కృష్ణమాచార్యులు, సత్యవరం రుత్వికుల ఆధ్వర్యంలో నిర్వహిం చారు. గజవాహనంపై స్వామి వారిని వేంచేపు చేసి వేద పఠనం, మంగళవాయిద్యాల నడుమ పట్టణంలో తిరువీధి చేప ట్టారు. ఈసందర్భంగా మహిళల కోలాటం, భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తప్పెట గుళ్ల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి పార్టీల అభ్యర్థి బగ్గు రమణ మూర్తి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వాసుదేవునికి ప్రత్యేక పూజలు

మందస: వాసుదేవాలయంలో వాసుదేవుని జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా ఆది వారం ఆలయ ప్రధాన అర్చకుడు కూర్మాచార్యులు ప్రత్యేక పూజలు చేపట్టారు. పలువురు భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

రామలింగేశ్వరునికి భష్మాభిషేకం

టెక్కలి: స్థానిక పట్టుమహాదేవి కోనేరు గట్టుపై ఉన్న రామ లింగేశ్వరస్వామి ఆల యంలో మహా రుద్రా భిషేకంలో భాగంగా ఆదివారం భస్మాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చ కులు తర్లా శివకుమార్‌ రుద్రాభి షేకం చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు అభిషేక సేవలో పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 11:33 PM

Advertising
Advertising