ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైభవంగా సీతారాముల పెళ్లి రాట

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:27 AM

హిరమండలం బ్యారేజి సెంటర్‌లో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో బుధవారం నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి సోమవారం పెళ్లి రాట మహోత్సవం చేపట్టారు.

హిరమండలం: పెళ్లిరాట వేస్తున్న భక్తులు

హిరమండలం: హిరమండలం బ్యారేజి సెంటర్‌లో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో బుధవారం నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి సోమవారం పెళ్లి రాట మహోత్సవం చేపట్టారు. సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన పతివాడ రమణ దంపతుల ఆధ్వర్యంలో మండపావాహనలు, అష్టదిగ్బలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం హోమం చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పచ్చని తోరణాలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. బుధవారం శ్రీరాముని కల్యాణం, పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు అర్చకుడు శ్రీనివాసశర్మ తెలిపారు. భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం
హరిపురం:
హరిపురం రైల్వేస్టేషన్‌ ఆవరణలో సోమవారం శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. లింగే శ్వర శర్మ ఆధ్వర్యంలో స్వామికి పూజ లు, ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. మూడురోజులు పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సీతారాముల విగ్రహాల ప్రతిష్ఠ
శ్రీకాకుళం కల్చరల్‌:
గుజరాతీపేటలో జగన్నాథస్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించారు. అర్చకులు పెంటా శ్రీనివాస్‌ శర్మ ఆధ్వర్యంలో స్వామి వారిని అలం కరించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం నిర్వహించ నున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 12:27 AM

Advertising
Advertising