ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రభుత్వ స్థలం కబ్జా

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:28 PM

సార్వత్రిక ఎన్నికల విధుల్లో అధికారులంతా నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేసి.. ఆక్రమిస్తున్నారు. అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టిన స్థలాలను సైతం ఆక్రమణకు యత్నించడం గమనార్హం.

ప్రభుత్వ స్థలంలో నిర్మించిన పునాదులు

-హెచ్చరిక బోర్డులు పీకేసి.. ఆక్రమణ

(వజ్రపుకొత్తూరు)

సార్వత్రిక ఎన్నికల విధుల్లో అధికారులంతా నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేసి.. ఆక్రమిస్తున్నారు. అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టిన స్థలాలను సైతం ఆక్రమణకు యత్నించడం గమనార్హం. వజ్రపుకొత్తూరు మండలం రాజాం పంచాయతీ పరిధిలోని తుఫాన్‌ రక్షిత భవనానికి సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని.. కొన్ని నెలల కిందట కొంతమంది పెద్దల సహాయంతో స్థానికులు ఆక్రమణకు యత్నించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు అందడంతో.. వారు పరిశీలించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో అధికారులు బిజీగా ఉండడంతో.. ఈ ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డులను ఆక్రమణదారులు పీకేశారు. ఇటీవల పునాదులు వేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్‌ వి.గిరిరాజు వీఆర్వోలను పంపించి పనులు నిలుపుదల చేయించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిగిలిన చోట్ల ప్రభుత్వ స్థలాల ఆక్రమణను కూడా అధికారులు గుర్తించి.. అడ్డుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:28 PM

Advertising
Advertising