ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కింజరాపు రామ్మోహన్‌నాయుడు అనే నేను...

ABN, Publish Date - Jun 24 , 2024 | 11:36 PM

కింజరాపు రామ్మోహన్‌నాయుడు అను నేను’ అంటూ కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌లో సోమవారం లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది.

కుటుంబ సభ్యులతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పార్లమెంట్‌లో సంతకం చేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

- తెలుగులో కేంద్రమంత్రి ప్రమాణస్వీకారం

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/రణస్థలం, జూన్‌ 24: ‘కింజరాపు రామ్మోహన్‌నాయుడు అను నేను’ అంటూ కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌లో సోమవారం లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ మేరకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు.. స్పష్టమైన తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ‘కింజరాపు రామ్మోహన్‌నాయుడు అనే నేను.. లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతను శ్రద్ధా శక్తులతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా’ అని పేర్కొన్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సైకిల్‌పై లోక్‌సభకు అప్పలనాయుడు

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంప్రదాయ వస్త్రధారణలో లోక్‌సభకు హాజరయ్యారు. సైకిల్‌పై ఆయన లోక్‌సభకు వెళ్లారు. మొదటిసారిగా పార్లమెంట్‌లో అడుగు పెట్టిన కలిశెట్టి మీడియాతో మాట్లాడుతూ చాలా అనందంగా ఉందన్నారు. కేంద్రం సహకారంతో జిల్లాలో పరిష్కారం కావాల్సిన ప్రధాన సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 11:36 PM

Advertising
Advertising