ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సహారా బాధితులకు న్యాయం చేయండి

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:57 PM

సహారా ఇండియా ఖతాదారులకు వెంటనే తమ డిపాజిట్‌ సొమ్ము చెల్లించి న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, సహారా ఇండియా పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు బోయిన సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ప్రధాన గేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న సహారా బాధితులు

- సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా

అరసవల్లి: సహారా ఇండియా ఖతాదారులకు వెంటనే తమ డిపాజిట్‌ సొమ్ము చెల్లించి న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, సహారా ఇండియా పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు బోయిన సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. సంస్థలో కోట్లాది మంది పెట్టుబడులు పెట్టా రని, సుప్రీంకోర్టు 2015లో 15శాతం వడ్డీతో బాధితు లకు వారి డిపాజిట్‌ సొమ్మును చెల్లించాలని ఆదేశా లు జారీ చేసినా ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమని విమర్శించారు. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది బాధితులు ఉన్నారని, జిల్లా లో లక్ష మంది వరకు ఉన్నా రన్నారు. వీరికి సుమారు రూ.500 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. సెంట్రల్‌ రిజిస్టర్‌ కోపరేటివ్‌ సొసైటీ ద్వారా దేశంలోని ప్రతీ ఖా తాదారునికి చెల్లింపులు చే స్తామని కేంద్రమంత్రి అమి త్‌ షా గతేడాది జూలైలో ప్రకటించారని, కానీ నేటికి బాధితులకు ఎటువంటి చె ల్లింపులు జరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని బాధితుల కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంత రం వారు జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉ పాధ్యక్షుడు కె.సూరయ్య, కార్యదర్శి ఎన్‌.గణపతి, పట్టణ కన్వీనర్‌ ఆర్‌.ప్రకాష్‌, సహారా ఖాతాదారులు, ఏజెంట్లు డీఎన్‌ మోహనరావు, బి.చిరంజీవిరావు, బి. సత్యనారాయణ, పి.బాబూరావు, సీహెచ్‌ మాధవ రావు, కేవీపీ రావు, బీవీ రమణ, వి.కాశీవిశ్వనాథ్‌, పి.కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

కార్మిక సంక్షేమ చట్టం అమలు చేయాలి

అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ చట్టం అమలు చేసి, తన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసంలో కలెక్టర్‌కు వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ గౌరవాధ్యక్షుడు ఎం. ఆదినారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి హరనాథ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సుమా రు లక్ష నిర్మాణ కార్మిక కుటుంబాలు సం క్షేమ చట్టం నిలుపుదల వల్ల ఇబ్బంది పడు తున్నాయన్నారు. చట్ట ప్రకారం నిర్మాణ యజమానుల నుంచి 1శాతం సెస్సు వసూలు చేసి క్లెయిమ్‌ల చెల్లింపులు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. గత ప్రభుత్వం సెస్సు వసూలు చేసి, క్లెయిమ్‌ చెల్లింపులు చేసిందని మండిపడ్డారు. ఇలా వసులు చేసిన సెస్సును ఇతర అవసరాలకు మల్లించిందని వాపోయారు. ఇది సుప్రీం తీర్పుకు వ్యతిరేకమ న్నారు. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రా ష్ట్రాల్లో సంక్షేమ చట్టం అమలవు తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం తక్షణమే ఈ చట్టాన్ని అ మలు చేయాలని, పెండింగ్‌ క్లె యిమ్‌లను చెల్లించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Jul 15 , 2024 | 11:57 PM

Advertising
Advertising
<