గురుకుల విద్యార్థిని ఆత్మహత్యపై విచారణ
ABN, Publish Date - Aug 01 , 2024 | 11:37 PM
నందిగాం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ విద్యార్థిని నిమ్మక అక్షిత ఆత్మహత్యపై లోతైన విచా రణ చేపడతామని గురుకులాల జిల్లా సమన్వయకర్త ఎన్. బాలాజీ నాయక్ అన్నారు
నందిగాం: నందిగాం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ విద్యార్థిని నిమ్మక అక్షిత ఆత్మహత్యపై లోతైన విచా రణ చేపడతామని గురుకులాల జిల్లా సమన్వయకర్త ఎన్. బాలాజీ నాయక్ అన్నారు . గురువారం ఆయన విద్యాలయాల వైద్యుడు రాజేష్‌తో కలిసి గురుకులంలో పరిశీలించారు. విద్యా ర్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రదేశం, హాస్టల్ రూంను పరిశీ లించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో చర్చించారు. పోస్టు మార్టం రిపోర్టు, తల్లిదండ్రుల వివరాలు, వారి అభ్యంతరా లను స్వీకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. పలాస ఆర్డీవో భరత్‌నాయక్ బుధవారం రాత్రి గురుకులాన్ని సంద ర్శించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు గురుకులాల డీసీ బాలాజీనాయక్‌తో కలిసి విద్యార్థినులు, ఉపాధ్యాయు లతో ఆత్మహత్య ఘటనపై ఆరా తీశారు. ఇతర విద్యార్థినులకు డాక్టర్ రాజేష్‌తో కౌన్సెలింగ్ ఇప్పించారు. ప్రిన్సిపాల్ బి.దమయంతి, ఎస్‌ఐ మహ్మద్ అమీర్ ఆలీతో చర్చించారు.
పిల్లలను తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు రాక
విద్యార్థిని లిమ్మక హర్షిత ఆత్మహత్యకు పాల్పడడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకు వెళ్లేందుకు గురువారం తరలివచ్చారు. కొద్ది రోజులు ఇంటికి పంపాలని, వారు బాలాజీనాయక్‌ను కోరారు. గురుకుల విద్యా ర్థిని ఆత్మహత్యపై బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు. గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు జె.పరమేశ్వరరావు, ఉపాధ్య క్షుడు ఎన్.లక్ష్మీనారాయణ, లింగరాజు కామరాజు, జి.మీనా కుమార్ గురుకులాన్ని సందర్శించి ఆత్మహత్యకు సంబంధించి కారణాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
అక్షిత మృతిపై దర్యాప్తు చేపట్టాలి
కొత్తూరు: మాసింగి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని నిమ్మక అక్షిత మృతిపై దర్యాప్తు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శిర్ల ప్రసాద్, గంగరాపు సింహాచలం, బీఎస్పీ పాతపట్నం నియోజకవర్గం నాయకుడు బొడ్డేపల్లి కృష్ణారావు కోరారు. గురువారం మృతు రాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కనీసం ముఖం చూపించకుండా పోస్టు మార్టం హడావుడిగా చేయడం ఏమిటని ప్రశ్నించారు.
Updated Date - Aug 01 , 2024 | 11:37 PM