వసతిగృహంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
ABN, Publish Date - Jul 05 , 2024 | 11:35 PM
స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు కోరారు.
సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న దృశ్యం
టెక్కలి: స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో మౌలిక సదుపా యాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు కోరారు. ఈ మేరకు శుక్రవారం సబ్ కలెక్టర్ నూరుల్ కమర్‌ను కలిసి హాస్టల్లో నెల కొన్న సమస్యలపై వినతిపత్రం అందించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని అనేక పర్యాయాలు అధికారులను కోరినా పట్టించుకోలేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న వసతిగృహ సంక్షేమాధి కారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తరుణ్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jul 05 , 2024 | 11:35 PM