పారదర్శక పాలనకు ప్రభుత్వం కృషి
ABN, Publish Date - Jul 15 , 2024 | 11:16 PM
ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనికి అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి
వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు
టెక్కలి, జూలై 15: ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనికి అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం నిమ్మాడ క్యాంపు కార్యా లయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాలను బలోపేతం చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన పంటలకు, పశుపోషణ ప్రోత్సాహానికి శతశాతం అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెం చాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. లక్ష్యాలను చేరుకునేందుకు అందరూ సమష్టిగా పని చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, డ్వామా పీడీ జీవీ చిట్టి రాజు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
శాలువాలు, బొకేలు తేవొద్దు
అభిమానులు, నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం వస్తు న్నారని, బొకేలు, శాలువలు, పూలదండలు తేవడం వల్ల సమయ పాలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇకపై ఇటువంటివి తీసుకు రావద్దని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తన వద్దకు వచ్చేవారి అభి మానమే పదివేల పూల దండలతో సమానమన్నారు. ఇకపై తన వద్దకు వచ్చే వారు ఒట్టి చేతులతో రావాలని ఆయన కోరారు.
Updated Date - Jul 15 , 2024 | 11:16 PM