ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కులదూషణ కేసులో నలుగురికి జైలు

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:33 AM

కులదూషణ కేసులో నలుగురికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి ఫణి కుమార్‌ శుక్రవారం తీర్పు చెప్పినట్టు ఎస్‌ఐ వై.మదుసూధనరావు తెలిపారు.

జి.సిగడాం: కులదూషణ కేసులో నలుగురికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి ఫణి కుమార్‌ శుక్రవారం తీర్పు చెప్పినట్టు ఎస్‌ఐ వై.మదుసూధనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. 2015 సంవత్సరంలో నిద్దాం గ్రామానికి చెందిన పొన్నాడ అప్పారావుకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తికి కొలతలు వేస్తుండగా అదే గ్రామానికి చెందిన గిరడ చిన్న ముళ్లునాయుడు, గిరడ కృష్ణారావు, గిరడ రమేష్‌, గిరడ రాం బాబు కలిసి కులం పేరుతో దూషించటంతో పాటు దాడి చేశారంటూ అప్పారావు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ జి.భాస్కరరావు కేసు నమోదు చేశారు. ఉమ్మడి జిల్లా పాలకొండ డీఎస్పీ ఆదినారాయణ దర్యాప్తు చేసి కోర్టుకు నివేదించారు. వాదో పవాదనలు విన్న న్యాయాధికారి ఈ నలుగురికి ఆరు నెలలు సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున్న జరిమానా చెల్లించారు. కాగా ఏ-2గా ఉన్న గిరడ కృష్ణారావు 2018లో మృతి చెందాడు. మిగతా ఏ-1, ఏ-3, ఏ-4లకు శిక్ష విధిం చారు. ఫిర్యాదు దారు అప్పారావు తరుఫున మెట్ట మల్యేశ్వరరావు వాదించారు.

Updated Date - Aug 24 , 2024 | 12:33 AM

Advertising
Advertising
<