ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సర్పంచ్‌ నుంచి ఎంపీగా ఎన్నిక

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:11 PM

సర్పంచ్‌ నుంచి ఏకంగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై అనంతరం రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత హనుమంతు అప్పయ్యదొరకే దక్కుతుంది. వజ్రపుకొత్తూరు మండలం బెండి పంచాయతీ సర్పంచ్‌గా అప్పయ్యదొర 1961 నుంచి 1981 వరకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ ఆ పంచాయతీ దొర వంశీయుల చేతిలోనే ఉంది. అనంతరం ఎన్టీ రామారావు టీడీపీ ఏర్పాటు చేసిన తర్వాత న్యాయవాది వృత్తిలో ఉన్న హనుమంతు అప్పయ్యదొర ఆ పార్టీలో చేరారు. 1984 నుంచి 1989 వరకు ఎంపీగా వ్యవహరించారు. అప్పటి వరకు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న బొడ్డేపల్లి రాజగోపాలరావుకు అప్పయ్యదొర చెక్‌పెట్టారు. అనంతరం 1994 నుంచి 99 సంవత్సరం వరకు టెక్కలి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలుపొందారు. తర్వాత రాజకీయ సమీకరణల నేపథ్యంలో 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పాటు ఆయన సమితి అధ్యక్షుడిగా, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా, సబార్డినేట్‌ లెజిస్ట్రేట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా కూడా పదవులు అలంకరించారు. కుగ్రామం బెండిలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అలంకరించారు. పార్లమెంట్‌లో ముస్లిం లా బిల్లుపై సుదీర్ఘ ప్రసంగం చేసిన ఘనత అప్పయ్యదొరకే దక్కింది. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ రూపకర్తగా గుర్తింపు పొందారు. దీంతో పాటు కాశీబుగ్గ, బెండి రైల్వే ఫ్లైఓవర్‌ ఆయన హయాంలోనే మంజూరయ్యింది. ఈ ఫ్లైఓవర్‌ పూర్తవగా, కాశీబుగ్గ ఫ్లైఓవర్‌ ఇంకా నిర్మాణంలోనే ఉంది. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు కాశీబుగ్గ వివేకానంద్‌మార్గ్‌లో నివాస ముంటున్నారు. 2014లో అప్పయ్యదొర మృతి చెందారు.

హనుమంతు అప్పయ్యదొర

పలాస: సర్పంచ్‌ నుంచి ఏకంగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై అనంతరం రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత హనుమంతు అప్పయ్యదొరకే దక్కుతుంది. వజ్రపుకొత్తూరు మండలం బెండి పంచాయతీ సర్పంచ్‌గా అప్పయ్యదొర 1961 నుంచి 1981 వరకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ ఆ పంచాయతీ దొర వంశీయుల చేతిలోనే ఉంది. అనంతరం ఎన్టీ రామారావు టీడీపీ ఏర్పాటు చేసిన తర్వాత న్యాయవాది వృత్తిలో ఉన్న హనుమంతు అప్పయ్యదొర ఆ పార్టీలో చేరారు. 1984 నుంచి 1989 వరకు ఎంపీగా వ్యవహరించారు. అప్పటి వరకు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న బొడ్డేపల్లి రాజగోపాలరావుకు అప్పయ్యదొర చెక్‌పెట్టారు. అనంతరం 1994 నుంచి 99 సంవత్సరం వరకు టెక్కలి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలుపొందారు. తర్వాత రాజకీయ సమీకరణల నేపథ్యంలో 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పాటు ఆయన సమితి అధ్యక్షుడిగా, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా, సబార్డినేట్‌ లెజిస్ట్రేట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా కూడా పదవులు అలంకరించారు. కుగ్రామం బెండిలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అలంకరించారు. పార్లమెంట్‌లో ముస్లిం లా బిల్లుపై సుదీర్ఘ ప్రసంగం చేసిన ఘనత అప్పయ్యదొరకే దక్కింది. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ రూపకర్తగా గుర్తింపు పొందారు. దీంతో పాటు కాశీబుగ్గ, బెండి రైల్వే ఫ్లైఓవర్‌ ఆయన హయాంలోనే మంజూరయ్యింది. ఈ ఫ్లైఓవర్‌ పూర్తవగా, కాశీబుగ్గ ఫ్లైఓవర్‌ ఇంకా నిర్మాణంలోనే ఉంది. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు కాశీబుగ్గ వివేకానంద్‌మార్గ్‌లో నివాస ముంటున్నారు. 2014లో అప్పయ్యదొర మృతి చెందారు.

Updated Date - Apr 25 , 2024 | 11:11 PM

Advertising
Advertising