ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రాపౌట్‌ విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి

ABN, Publish Date - Aug 21 , 2024 | 11:55 PM

మండలంలో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకూ 2,166 మంది డ్రాపౌట్‌ విద్యార్థులు ఉన్నారని, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నాయుడు అన్నారు.

పలాసరూరల్‌: మండలంలో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకూ 2,166 మంది డ్రాపౌట్‌ విద్యార్థులు ఉన్నారని, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నాయుడు అన్నారు. పలాస మండల పరిషత్‌ కార్యాలయంలో పాఠశాల సిబ్బంది, సీఆర్‌ఎంటీలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ డ్రాపౌట్‌ విద్యార్థుల వివరాలపై దృష్టిసారించి నమోదు చేయాలన్నారు. పది, ఇంటర్‌లో చేరాలనుకునేవారిని గుర్తించి వారిని ఓపెన్‌ స్కూల్‌ ద్వారా జాయిన్‌ చేయాలని తెలిపారు. సమావేశంలో మండల విద్యాశాఖాధికారులు సీహెచ్‌.శ్రీనివాసరావు, సత్యం, వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, డేటా ప్రొసెసింగ్‌ సెక్రటరీలు, సీఆర్‌ఎంటీలు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:55 PM

Advertising
Advertising
<