ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటమి తప్పేలా లేదు ‘స్వామీ’

ABN, Publish Date - May 31 , 2024 | 12:02 AM

విజయనగరం... చారిత్రకంగానే కాదు.. రాజకీయంగానూ ప్రసిద్ధి చెంది నది. ఇక్కడి ఓటర్లు ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారన్న వార్తలు అధికార వైసీపీలో గుబులు పుట్టిస్తున్నాయి.

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)
విజయనగరం... చారిత్రకంగానే కాదు.. రాజకీయంగానూ ప్రసిద్ధి చెంది నది. ఇక్కడి ఓటర్లు ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అను కూలంగా తీర్పు ఇచ్చారన్న వార్తలు అధికార వైసీపీలో గుబులు పుట్టిస్తు ్తన్నాయి. ఈ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామిని తొలి నుంచీ ఓటమి భయం వెంటాడుతోంది. ఇది ఎంత వరకూ వచ్చిందంటే ‘వైసీపీని చూసి కాదు... నన్ను చూసి ఓటు వేయాల’ని ఉద్యో గ సంఘాలను వేడుకునే వరకూ. దీన్ని బట్టి పరిస్థితిని అర్ధం చేసుకోవ చ్చు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాలతో కోలగట్ల సమావేశాలు నిర్వహించారు. బహుమతులు పంచిపెట్టారు. పంచభక్ష్య పరమాన్నాలు పెట్టించారు. వలంటీర్లు, మహిళా సంఘాలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్‌ఎమ్‌లు ఇలా ఏ వర్గాన్నీ వదలకుండా తమకు ఓటు వేయాలని కోరుతూ సమావేశాలు నిర్వహించారు. వివిధ రూపాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ యంత్రాంగాన్ని తన సొంత జాగీరులా వాడుకున్నారు. విజయనగరం తహసీల్దార్‌ వద్ద జగనన్న ఇళ్ల స్థలాల ఖాళీ పట్టాలు ఉన్నాయి. వీటిలో కొన్నిటిని చివరిలో తనకు నచ్చిన వారికి, అనుయాయులకు, కారు డ్రైవర్ల కు పంచి పెట్టారు. ఇలా రెవెన్యూ యంత్రాంగం సాయంతో ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారన్న వ్యాఖ్యానాలూ వినిపిస్తున్నాయి.
పార్టీలో వ్యతిరేకత..
ఎమ్మెల్యే కోలగట్ల ఇచ్చిన తాయిలాలను స్వీకరించిన అనేక మంది ఓట్లు మాత్రం ఆయనకు వేయలేదన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా కొంత మంది పనిచేశారు. పార్టీలో తమను ఎదగనీయ కుండా కోలగట్ల అడ్డుకున్నారనే ఉద్దేశంతో అవనాపు విజయ్‌, పిళ్లా విజయ్‌కుమార్‌లు టీడీపీలో చేరారు. వీరు మంత్రి బొత్స సత్యనారాయణకు కీలక అనుచరులు. అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ కాళ్ల గౌరీశంకర్‌ నేరుగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే దురాగతాలను, భూ కబ్జాలను, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార అక్రమాలను గౌరీశంకర్‌ ఎప్పటికప్పుడు విలేకరుల సమావేశాల్లో బయట పెడుతూ వచ్చారు. ఇలా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి పార్టీలోని వివిధ వర్గాల వారు కోలగట్లకు కంటి మీద కునుకు లేకుండా చేశారు.
‘స్ట్రాంగ్‌’గా అనుమానాలు..
అధికార యంత్రాంగాన్ని కూడా కోలగట్ల తనకు అనుకూలంగా మలచుకున్నారని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. తహశీల్దార్‌ కార్యాలయంలో భద్రపరచిన పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సుల స్టా్ట్రంగ్‌ రూమ్‌ సీళ్లను తొలగించి లోపలకు ప్రవేశించేటపుడు కూడా ఎన్నికల సిబ్బంది (రెవెన్యూ) నిబంధనలు పాటించలేదు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎమ్మెల్యే అల్లుడు, విజయనగరం ఎంపీపీ.. పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సుల గదిలోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రణాళిక వేసుకున్న తీరు విస్తుగొల్పుతోంది. మిగిలిన పార్టీల అభ్యర్థులకు విషయం సరిగా చెప్పకుండా కలెక్టరేట్‌కు రావాలని మాత్రమే సమాచారం అందించి... తప్పుదోవ పట్టించారు. దీనికంతటికీ కోలగట్లకు గల ఓటమి భయమే కారణంగా కనిపిస్తోంది. ఇలా వారు మాత్రమే వెళ్లడంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి దిగువ స్థాయి అధికారులను కాపాడే విధంగా ముందుకు సాగుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అందువల్లనే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు సరికదా సంబంధిత అధికారులను ఎన్నికల విధుల్లోనే కొనసాగిస్తుండడం గమనార్హం.
ఎలా కుదిరిందబ్బా?
ఎమ్మెల్యే కోలగట్లకు... విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. ఎన్నికల సమయంలోనే ఇద్దరికీ ఎక్కడ ‘కుదిరిందో’ తెలియదు కానీ పోస్టల్‌ బ్యాలెట్ల స్ట్రాంగ్‌ రూమ్‌ వద్దకు తన అల్లుడు కౌశిక్‌తో పాటు ఎంపీపీని కూడా ఎమ్మెల్యే పంపించారు. మామిడి అప్పలనాయుడుకు ఇటువంటి ఎన్నికల కుతంత్రాల్లో సిద్ధహస్తుడిగా పేరుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇటువంటి కథ నడిపించిన ఘనత ఎంపీపీకి ఉంది. ఇన్నాళ్లూ ఎమ్మెల్యే కోలగట్లకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎంపీపీ.. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్దకు వెళ్లడంలో ఆంతర్యం ఏమిటన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది. మరో వైపు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు మాత్రమే హాజరు కావడమేంటి? ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ప్రతినిధులు ఎవరూ లేరని తెలిసి స్ట్రాంగ్‌ రూమ్‌ సీళ్లు ఎలా తెరిచారు? సంబంధిత అధికారులపై జిల్లా ఎన్నికల అధికారి తీసుకున్న చర్యలు ఏమిటి? అన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. కోలగట్ల వేసిన వివాదాస్పద అడుగులు... ఓటమి భయంతోనేనని స్పష్టమవుతోంది. మరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారో వచ్చే నెల 4న తేలనుంది.

Updated Date - May 31 , 2024 | 12:02 AM

Advertising
Advertising