ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్నిమంజూరు చేయండి

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:14 PM

పలాస నియోజకవర్గంలో యువత నైపుణ్యం వెలికితీసి ఉపాధి కల్పించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు.

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే శిరీష, వెంకన్నచౌదరి

మంత్రి నారా లోకేష్‌ను కోరిన ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, జూలై 15: పలాస నియోజకవర్గంలో యువత నైపుణ్యం వెలికితీసి ఉపాధి కల్పించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ మేరకు ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్‌ను సోమవారం అమరావతిలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పలాసను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికతో ముం దుకు వెళ్తున్నామన్నారు. ‘ప్రతి చేతికి పని-ప్రతి చేనుకు నీరు’ అనే సంక ల్పంతో వెళ్తున్న తాము ఇప్పటికే వంశధార నీటిని శివారు భూముల వరకు తీసుకువచ్చామన్నారు. మత్స్యకార యువతకు ఉపాధి కల్పిం చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సీమెన్‌, మర్చంట్‌ నేవీ వంటి అంశాల్లో శిక్షణ కేంద్రం మంజూరు చేస్తే ఉపాధి అవకాశాలు ఎక్కు వగా ఉంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉద్దానంలో కొబ్బరి, జీడి అధికంగా సాగవుతోందని, చిన్నతరహా, కుటీర పరిశ్రమ లు ఏర్పాటు చేస్తే అదనపు ఆదాయం వస్తుందన్నారు. సమస్యలను త్వరి తగతిన పరిష్కరించేందుకు మంత్రి లోకేష్‌ సానుకూలంగా స్పందిం చినట్లు తెలిపారు. ఆమెతో పాటు పలాస నియోజకవర్గ ఇన్‌ చార్జి యార్లగడ్డ వెంకన్నచౌదరి ఉన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:14 PM

Advertising
Advertising
<