ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

16 ఏళ్ల తర్వాత..

ABN, Publish Date - Jul 24 , 2024 | 11:19 PM

ఈస్ట్‌కోస్‌ రైల్వే కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఎన్నికలు 16 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారం సాయంత్రం వరకూ కొనసాగునున్నట్టు అధికారులు ప్రకటించారు.

ఓటు వేసేందుకు క్యూలో ఉన్న రైల్వే ఉద్యోగులు

- రైల్వే కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఎన్నికలు

- కార్మిక సంఘాల నాయకుల కోలాహలం

పలాస, జూలై 24: ఈస్ట్‌కోస్‌ రైల్వే కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఎన్నికలు 16 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారం సాయంత్రం వరకూ కొనసాగునున్నట్టు అధికారులు ప్రకటించారు. రైల్వే కార్మిక సంఘ నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల కేంద్రం వద్ద కోలాహలం నెలకొంది. ఖుర్ధారోడ్‌ డివిజన్‌ పరిధిలో పలాస రైల్వే స్టేషన్‌ ఆవరణలో మొత్తం మూడు పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 630 ఓటర్లకుగాను రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ కార్యాలయం వద్ద రెండు, ఇంజనీరింగ్‌ కార్యాలయం వద్ద ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రామిక్‌ కాంగ్రెస్‌ నుంచి జె.తేజేశ్వరావు, డి.శ్యామసుందర్‌, ఎంఎస్‌.ప్రసాద్‌ బరిలో నిలిచారు. శ్రామిక్‌ యూనియన్‌ నుంచి ఎల్‌.మోహనరావు, పీవీఎన్‌.రావు, పీఎస్‌.రావు పోటీ పడుతున్నారు. ఇరు సంఘాల నుంచి మొత్తం ముగ్గురు ప్రతినిధులను ఎంపిక చేసి అర్బన్‌ బ్యాంకు సభ్యులుగా పంపించనున్నారు. ఈ నెల 26న జోన్‌ పరిధిలోని ఎన్నికల్లో గెలుపొందిన వారి వివరాలు ప్రకటిస్తారు. వీరు ఉద్యోగులకు సహాయకారులుగా వ్యవహరిస్తారు.

Updated Date - Jul 24 , 2024 | 11:19 PM

Advertising
Advertising
<