ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం

ABN, Publish Date - Jul 05 , 2024 | 12:06 AM

పెద్దకొజ్జిరీయ జంక్షన్‌ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిసా రాష్ట్రం చత్రపురం గ్రామానికి చెందిన దిలీప్‌ పొరిడా (24)మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

- ఒకరి మృతి, మరొకరికి గాయాలు

కంచిలి: పెద్దకొజ్జిరీయ జంక్షన్‌ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిసా రాష్ట్రం చత్రపురం గ్రామానికి చెందిన దిలీప్‌ పొరిడా (24)మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు, కంచిలి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దిలీప్‌ పొరిడా కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతడితోపాటు అదే గ్రామానికి చెందిన హరిహర పరిడా, దిబా కల్యాణ్‌ ప్రధాన్‌తో కలిసి వేర్వేరు ద్విచక్ర వాహనాలపై బెంగళూరులో బయలుదేరారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పెద్దకొజ్జిరీయ జంక్షన్‌ సమీపాన రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టగా దిలీప్‌ పొరిడా అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న హరిహర పరిడా గాయపడ్డాడు. ఇతడిని చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హరిహర పరిడా ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ జి.రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:06 AM

Advertising
Advertising