AP News: దుర్గమ్మ ఆలయంలో ఘనంగా శ్రీ పంచమి వేడుకలు
ABN, Publish Date - Feb 14 , 2024 | 10:04 AM
Andhrapradesh: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సరస్వతి దేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 14: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సరస్వతి దేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీ పంచమి సందర్భంగా విద్యార్థులకు పెన్నుల వితరణ చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు దుర్గమ్మ ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి పెన్నుతో ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతామని విద్యార్థులు చెబుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 14 , 2024 | 10:04 AM