ఏపీ కోసం రోడ్ మ్యాప్-2029
ABN, Publish Date - Jun 09 , 2024 | 03:12 AM
అభివృద్ధి చెందుతున్న అగ్రగామి రాష్ర్టాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దటానికి రంగాల వారీగా తాము రూపొందించిన ‘రోడ్ మ్యాప్ - 2029’ను ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకు,
త్వరలో సీఎంకు అందజేత: ఏపీ చాంబర్స్
విజయవాడ, జూన్ 8(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి చెందుతున్న అగ్రగామి రాష్ర్టాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దటానికి రంగాల వారీగా తాము రూపొందించిన ‘రోడ్ మ్యాప్ - 2029’ను ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉన్నతాధికారులకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రాష్ట్ర ఆర్థిక సంక్షోభం, గ్రీన్‌ఫీల్డ్ రాజధాని వంటి అనేక సవాళ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయని తెలిపారు. రాష్ర్టాభివృద్ధి కోసం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడం, నిరుద్యోగాన్ని పరిష్కరించడం మొదలైనవి ప్రధానమైన అంశాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంఎ్‌సఎంఈ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, కొత్త ప్రభుత్వం ఈ రంగానికి జీవం పోసే విధంగా సమస్యలను త్వరగా పరిష్కరించటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. తామిచ్చే రోడ్‌మ్యా్‌పలో డిమాండ్ల పరంగా చూస్తే తక్షణమే పరిష్కరించదగిన ఆర్థికభారం లేని అంశాలు కూడా ఉన్నాయని వివరించారు. నూతన ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొంటూ చాంబర్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Jun 09 , 2024 | 03:12 AM