ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి రిలీవ్
ABN, Publish Date - Jul 12 , 2024 | 04:00 AM
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీ్‌స చాన్సలర్ కేసీ రెడ్డి బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన చాన్సలర్‌గా నియమితులయ్యారు.
అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీ్‌స చాన్సలర్ కేసీ రెడ్డి బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన చాన్సలర్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం శుక్రవారంతో ముగుస్తోంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో బాధ్యతల నుంచి తప్పించాలని ఇటీవల ఆయన లేఖ రాశారు. దీంతో ఆయన్ను బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
Updated Date - Jul 12 , 2024 | 07:42 AM