త్వరలో రాజమండ్రి-ఢిల్లీ విమాన సర్వీసులు
ABN, Publish Date - Sep 09 , 2024 | 03:06 AM
తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం నుంచి మరిన్ని పట్టణాలకు కనెక్టివిటీ సర్వీసులు ప్రారంభించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడి
కోరుకొండ, రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 8: తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం నుంచి మరిన్ని పట్టణాలకు కనెక్టివిటీ సర్వీసులు ప్రారంభించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదివారం మధురపూడికి విచ్చేసిన ఆయన విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవనంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఢిల్లీ, తిరుపతి, వారాణసీ, షిరిడీ తదితర ప్రదేశాలకు మధురపూడి నుంచి కనెక్టివిటీ సర్వీసులు కలపాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. త్వరలోనే ఢిల్లీకి కనెక్టివిటీ సర్వీసులు ప్రారంభించనున్నామని తెలిపారు.
నదికి, కాలువకు తేడా తెలియని వ్యక్తి జగన్
నదికి, కాలువకు తేడా తెలియని వ్యక్తి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ విజయవా డ ముంపు విషయంలో వైసీపీ ఫేక్ ప్రాపగండా చేస్తోందని మండిపడ్డారు. బుడమేరులో గేట్లు ఎత్తేశారని చెప్పారని, అవి ఎక్కడున్నాయో జగన్ చూపించాలని సవాల్ విసిరారు.
Updated Date - Sep 09 , 2024 | 03:06 AM