ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

rain వాగులు పొంగేలా వానలు

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:23 AM

జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా గార్లదిన్నె మండలంలో 126.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.

నీట మునిగిన పంట పొలాలు

196 హెక్టార్లల్లో రూ.1.73 కోట్ల నష్టం

అనంతపురం అర్బన, ఆగస్టు 20: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా గార్లదిన్నె మండలంలో 126.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. బ్రహ్మసముద్రం మండలంలో 71.4 మి.మీ., యల్లనూరు 70.8, పామిడి 65.4, బుక్కరాయసముద్రం, రాప్తాడు 57.8, గుత్తి 55.6, పుట్లూరు 54.8, రాయదుర్గం 54.2, పెద్దవడుగూరు 52.4, తాడిపత్రి 50.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు 47.2, విడపనకల్లు 43.6, గుంతకల్లు 42.2, యాడికి 42.0, డి. హిరేహాళ్‌, కుందుర్పి 40.6, శెట్టూరు 40.4, అనంతపురం నగరం 38.4, కళ్యాణదుర్గం 37.4, పెద్దపప్పూరు 37.2, శింగనమల 35.6, కణేకల్లు 34.0, కూడేరు 31.2, బెళుగుప్ప మండలంలో 30.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 29.4 మి.మీ.లోపు నమోదైంది. భారీ వర్షం పడిన ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బెళుగుప్ప సమీపంలోని బ్రిడ్జిపై వర్షపు నీరు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 196 హెక్టార్లల్లో రూ.1.73 కోట్ల విలువైన పంటనష్టం జరిగింది. ఇందులో బీర, అరటి, ఎండు మిరప, టమోటా, కళింగర, బీన్స, ఉల్లిగడ్డ, బొప్పాయి, సాంబార్‌ దోస, వంకాయ తదితర పంటలు ఉన్నాయి. గార్లదిన్నె, రాప్తాడు, పెద్దవడుగూరు మండలాల్లో కంది, మొక్కజొన్న, వరి, వేరుశనగ పంటనష్టం జరిగింది.

Updated Date - Aug 21 , 2024 | 12:23 AM

Advertising
Advertising
<