ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భర్త కోసం భార్య.. తండ్రి కోసం కుమార్తె పూజలు

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:45 PM

బరిలో ఉన్న అభ్యర్థుల విజ యానికి వారి కుటుంబ సభ్యులు శ్రమిస్తు న్నారు. ఓ వైపు ప్రచారాలు, మరో వైపు పూజ ల్లో బిజీ బిజీగా కన్పిస్తున్నారు. టీడీపీ, జనసే, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌ గెలుపు కోసం ఆయన సతీమణి తెన్నేటి శిరీష, ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య విజయం కోసం ఆయన కుమార్తె శివనారాయణదేవి త మవంతు పాత్రను పోషిస్తున్నారు.

సాయిబాబా ఆలయంలో కూటమి ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్‌ భార్య శిరీష, ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య కుమార్తె శివనారాయణదేవి పూజలు

చీరాల, ఏప్రిల్‌ 18 : బరిలో ఉన్న అభ్యర్థుల విజ యానికి వారి కుటుంబ సభ్యులు శ్రమిస్తు న్నారు. ఓ వైపు ప్రచారాలు, మరో వైపు పూజ ల్లో బిజీ బిజీగా కన్పిస్తున్నారు. టీడీపీ, జనసే, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌ గెలుపు కోసం ఆయన సతీమణి తెన్నేటి శిరీష, ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య విజయం కోసం ఆయన కుమార్తె శివనారాయణదేవి త మవంతు పాత్రను పోషిస్తున్నారు. గురువా రం పలుదేవాలయాల్లో వారు పూజలు నిర్వహించారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవాలని కోరుకున్నారు. ఆయా సందర్భాల్లో పనిలో పనిగా స్థానిక ప్రజలు, భక్తులతో సైకిల్‌ గుర్తుపై ఓట్లేసి కూటమి అభ్యర్థులను గెలిపిం చాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముందుగా పట్టణంలోని పాపరాజుతోటలో ఉన్న సాయిబాబా ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత పేరాల శివాలయం, సాయిబాబాగుడి, కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఎంపీగా టీ కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యేగా కొండయ్య గెలుపొందాలని గోత్రనామాలతో అభిషేకాలు, అర్చనలు చే యించారు. ఆ తరువాత మండల పరిధిలోని ఈపురుపాలెం రాములవారి ఆలయం లో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తమ వారిని గెలిపించేందుకు సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేత డాక్టర్‌ సజ్జా హేమలత, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:45 PM

Advertising
Advertising