ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

డీఎల్‌పీవో కార్యాలయంలో ఏం జరుగుతోంది..?

ABN, Publish Date - May 24 , 2024 | 11:49 PM

మార్కాపురం డివిజ నల్‌ పంచాయతీ కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై కొనసాగుతున్న వేధింపులు జిల్లావ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారాయి.

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 24 : మార్కాపురం డివిజ నల్‌ పంచాయతీ కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై కొనసాగుతున్న వేధింపులు జిల్లావ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారాయి. ఆ కార్యాలయంలో జరుగుతున్న తీరును, బాధను తట్టుకోలేక తమ సెల్‌ఫోన్‌లో అక్కడ జరిగే పరిణామాలన్నింటిని రికార్డ్‌ చేసిన ఆడియోలు బయటకు వస్తుండడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో ఏవరైనా తప్పు చేస్తే వారిని మందలించాల్సిన అధికారే అందుకు భిన్నంగా వ్యవహ రించిన తీరుపై అటు అధికారులు, ఇటు ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగి తన కాలుకు వేసుకున్న షూస్‌ తీసేయాలని సదరు అధికారి అడిగారంటే మహిళా ఉద్యోగుల పట్ల ఏ విధమైన వివక్ష కొనసాగుతుందో ఆర్థం చేసుకోవచ్చు. ఆ కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులు కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌, ఒక అధికారిపై జిల్లా పంచాయతీ కార్యాలయంలో వారంరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో డీపీవో లేకపోవడంతో తపాలలో ఇచ్చారు. తపాలలో ఫిర్యాదు ఇచ్చిన పది నిమిషాలకే అక్కడి నుంచి ఇక్కడి డీఎల్‌పీవో కార్యాలయానికి ఉప్పందింది. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి, నేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సమాచారం ఇచ్చారు. సాధారణంగా కార్యాల యానికి వచ్చే ఆర్జీలను పంచాయతీ అధికారి అందుబాటు లో లేకపోతే ఆ కార్యాలయ ఏవో దృష్టికి తీసుకెళ్లాలి. కానీ అందుకు భిన్నంగా ఒక ఉద్యోగి ఆ ఆర్జీని తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకొని వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తికే చేరవేశారు. దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇక డీపీవో కు ఈ కార్యాలయంలో పట్టులేదనే వాస్తవం ఈ ఘటన ద్వారా స్పష్టమౌతోంది. ఒక వైపు జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి విచారణ చేసిన తర్వాత కూడా డీఎల్‌పీవో కార్యాలయంలో వేధింపులు రోజు రోజుకు పెరిగిపోవడంతో ఆమె విచారణ కూడా మహిళలకు న్యాయం చేయలేకపోయిందనే చెప్పాలి. అయితే మహిళా ఉద్యోగులు ఆ కార్యాలయంలో తమకు ఎదర వుతున్న వేధింపులను వాయిస్‌ రికార్డుల ద్వారా వెలుగు చూపడంతో ఇక్కడి అరాచకాలు వెలుగుచూశాయి. ఇదే క్రమంలో గురువారం కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ ఇరువురు మహిళా ఉద్యోగులకు జీతాలు నిలిపి వేయడంతో పాటు ఇక్కడ ఏవిధంగా ఉద్యోగాలు చేస్తారో అంటూ బేదిరింపులకు పాల్పడ్డాడు. శుక్ర వారం బయటకు వచ్చిన ఆడియోలో అక్కడ పనిచేసే ఒక అధికారి అనుసరించిన విధానాలను చర్చనీ యాంశంగా మారాయి. శుక్రవారం బయటకు వచ్చిన ఆడియోలో ఆ మహిళా ఉద్యోగి తను ఆఫీసుకు సమయానికి రావడంలేదా? తాను ఏమి తప్పు చేశాను? తన మీద వేధింపులకు జరుగుతున్నాయని చెప్పి నా తననే తప్పుబడుతే ఇబ్బందులకు గురిచేస్తారా? ప్రశ్నించడం వెలుగు చూసింది. ఈ క్రమంలోనే రెండు రోజుల నుంచి ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలతో మహిళా ఉద్యోగులకు మార్కాపురంలో పనిచేసే నాల్గవ తరగతి ఉద్యోగులు బాసటగా నిలిచినట్లు సమాచారం.

చేసేది లేక కాళ్లబేరానికి...

మహిళా ఉద్యోగులను సదరు అధికారి వేధిస్తున్న తీరు ఇటు జిల్లా అధికారులకు, ఇటు పత్రికల ద్వారా ప్రజలకు చేరువ కావడంతో సదరు అధికారి కాళ్లబేరానికి వచ్చినట్లు తెలిసింది. ఆ మహిళా ఉద్యోగిని వద్ద ‘నన్ను క్షమించండి’ అంటూ వేడుకున్నట్లు సమాచారం. ఇక ఇదే జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదును నేరుగా సంబంధిత డీపీవోకు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదనే చర్చ నడుస్తోంది. జిల్లా పంచా యతీ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి ఫిర్యాదును తన సెల్‌ఫోన్‌ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే పంపడం వల్లనే మరింత వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - May 24 , 2024 | 11:49 PM

Advertising
Advertising