ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల నిబంధనలతో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:52 AM

ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కావ డంతో పోలీసులు అధికారులు అందుకు సంబంధిం చిన ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. దీం తో ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది.

అవస్థలు పడిన నగరవాసులు

పోలీసు అధికారులపై ఏఎస్పీ ఆగ్రహం

ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 18: ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కావ డంతో పోలీసులు అధికారులు అందుకు సంబంధిం చిన ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. దీం తో ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది. ఒంగోలు న గరంలోని ప్రకాశంభవన్‌ గల కలెక్టర్‌ చాంబర్‌లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధిం చి, పక్కనే ఉన్న ఆర్డీవో కార్యాలయంలో ఒంగోలు అ సెంబ్లీకి సంబంధించిన నామినేషన్లు ప్రక్రియ ప్రా రంభమయింది. ఈనెల 25వ తేదీ వరకు ఈప్రక్రి య జరుగుతుంది. నిబంధనల ప్రకారం నామినేష న్లు స్వీకరించే ప్రాంతాల నుంచి చుట్టూ 200 మీట ర్లు రెండు అంచలగా బారిగేడ్లు ఏర్పాటు చేసి రహ దారులను మూసివేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొన సాగింది. అయితే ప్రజలకు ఎలాంటి ముందస్తు స మాచారం ఇవ్వకుండా దారులన్నీ మూసివేయడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులుపడ్డారు. ఎటు నుం చి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎ టువైపు వెళ్ళినా బారిగేట్లతో రోడ్డును మూసివేసిన పోలీసులు కనీసం ప్రత్యామ్నాయ మార్గాలు చూపక పోవడం ప్రజలు అసహనానికి గురయ్యారు. ఎవరో నామినేషన్లు వేస్తుంటే మాకు ఎందుకు ఇన్నీ కష్టా లు అంటూ బాహటంగా పోలీసులతో వాగ్యావాదాల కు దిగారు.

ముందస్తు సూచనలు లేవు..

జిల్లా కేంద్రం కావడంతో ప్రజలు అనేక అవసరా లతో ఇక్కడకు వస్తుంటారు. కేశవస్వామిపేట వద్ద పూర్తిగా బారిగేడ్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్‌ కార్యాల యం వైపు దారి బంద్‌ చేశారు. అదేవిధంగా నెల్లూ రు బస్టాండ్‌, పాత ఎస్‌బీఐ తదితర ప్రాంతాలలో బారిగేడ్లు ఏర్పాటు చేయగా అడ్డరోడ్డుల నుంచి కూ డా వెళ్లేందుకు దారులు లేకుండా చేశారు. ఈక్ర మంలో ప్రజలు, వాహన రాకపోకలకు ప్రత్యామ్నా య మార్గాలు చూపకుండా పోలీసులు గాలికి వది లేశారు. ఉష్టోగ్రత తీవ్రత ఎక్కువగా ఉండటం, పి ల్లలకు ఒకపూట బడులు కావడంతో మధ్యాహ్నం ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీంతో పిల్లలు ఇళ్లకు చే రే సరికి రెండు గంటల సమయం పట్టింది. పిల్లల తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు.

అలసత్వం వహిస్తే చర్యలు : ఏఎస్పీ

స్థానిక ప్రకాశంభవన్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు చూ స్తున్న పోలీసు అధికారులపై అదనపు ఎస్పీ నాగేశ్వ రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం ఉద యం పది గంటల దాటినా ఎవరు ఎక్కడ విధులు నిర్వహించాలో కూడా అవగాహన లేకపోవడం ఏ మిటని మండిపడ్డారు. విధినిర్వహణలో అలసత్యం పాటిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated Date - Apr 19 , 2024 | 12:52 AM

Advertising
Advertising