ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

ABN, Publish Date - Apr 16 , 2024 | 01:20 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏదీ లేదని టీడీపీ కూటమి అభ్యర్థి గూడూరి ఎరక్షన్‌బాబు అన్నారు.

పుల్లలచెరువు, ఏప్రిల్‌ 15: వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏదీ లేదని టీడీపీ కూటమి అభ్యర్థి గూడూరి ఎరక్షన్‌బాబు అన్నారు. శనివారం ఎర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయంలో పుల్లలచెరువు మండలం నరజాముల తాండలో వైసీపీ నుంచి టీడీపీలో చేరీన 30, నాయుడుపాలెం ఎస్సీ పాలెం నుంచి 10 కుటుంబాలకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మంచి నీటి సమస్య తీవ్రం గా ఉన్నా, ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. గిరిజనులకు వైసీపీ పాలనలో ఒరిగిందేమిలేదని అన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, శనగా నారాయణరెడ్డి, కాకర్ల కోటయ్య, ఎంపీటీసీ సభ్యుడు వెంగయ్య, శ్యామ్‌, సేవ్యానాయక్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మంత్రునాయక్‌, నాయకులు పాల్గొన్నారు.

19న నామినేషన్‌

ఎర్రగొండపాలెం : ఈ నెల 19న ఎర్రగొండపాలెం నుం చి టీడీపీ కూటమి అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు. ఆదివారం పట్టణం లోని టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. 19న ఉదయం 10 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారని మండలాల్లోని టీడీపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు హజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నెరవీంద్ర, టీడీపీ మండలాధ్యక్షుడు చేకూరి సుబ్బయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, చిట్యాల వెంగళరెడ్డి, కాకర్ల కోటయ్య, వేగినాటి శ్రీనివాస్‌, శనగ నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:20 AM

Advertising
Advertising