ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాలువ కట్టి.. కనికట్టు చేసి..

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:25 AM

ఒకటికాదు రెండుకాదు ఇప్పటి వరకు ఐదుసార్లు రూ.కోట్లు విలువైన ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు వైసీపీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ప్రయత్నించారు.

మార్కాపురం, జూన్‌ 16: ఒకటికాదు రెండుకాదు ఇప్పటి వరకు ఐదుసార్లు రూ.కోట్లు విలువైన ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు వైసీపీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ప్రయత్నించారు. గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేయడం అక్రమాన్ని నిలిపిశాడు. అయినప్పటికీ, నాడు అధికారం అండ ఉన్న ఆ నాయకుడు మాత్రం తన పట్టు విడవలేదు. తన భూమికి ముందున్న ఆర్‌అండ్‌బీ స్థలాన్ని ఎలాగైనా కొట్టేయాలని కొత్త ప్రణాళిక వేశాడు. పంచాయతీ నిధులతో రెండు స్థలాల మధ్య కాలువ కట్టి ఆర్‌అండ్‌బీ స్థలాన్ని వదిలేస్తున్నట్లు గ్రామస్థులను నమ్మించాడు. అంతలోనే రూ.కోట్ల విలువచేసే ఆర్‌అండ్‌బీ స్థలాన్ని ప్రస్తుతం చదునుచేసి కొట్టేసేందుకు వేగంగా నిర్మాణాలు చేస్తున్నాడు. అడ్డుకోవాల్సిన అధికారులు జేబులు తడుపుకొని చోద్యం చూస్తున్నారు.

గుట్టుగా ఆక్రమించేందుకు యత్నం

మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో 856 సర్వే నెంబర్‌లో 3.01 ఎకరాల భూమి ఆర్‌అండ్‌బీ రోడ్డుకు సంబందించి ఉంది. ఆ సర్వే నెంబర్‌లో 300 మీటర్ల మేర రోడ్డు ఉంది. కానీ ఎస్సీ కాలనీ సమీపానికి వచ్చేసరికి 50 సెంట్ల భూమి వ్యవసాయ భూములవైపు ఖాళీగా ఉంది. దరిమడుగు గ్రామ సమీపంలో భూము లకు గతంలో పెద్దగా ధరలు లేవు. కానీ 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎన్‌హెచ్‌ 565 జాతీయ రహదారిని మంజూరు చేయించి పనులు ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇదే అదునుగా ఆర్‌అండ్‌బీ స్థలాన్ని ఎలాగైనా కొట్టేయాలని సదరు వైసీపీ మండల ప్రజాప్రతినిధి పక్కనేవున్న భూమిని కొనుగోలు చేశాడు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తైన తర్వాత ఒకసారి ఆర్‌అండ్‌బీ స్థలాన్ని చదునుచేసి ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నిశబ్ధంగా ఉన్న సదరు నేత వైసీపీ అధికారంలోకి రావడంతో ఒక కొత్త ప్రణాళిక వేశాడు. తన భూమికి ఆర్‌అండ్‌బీ స్థలానికి మధ్యన పంచాయతీ నిధులతో మురుగు కాలువ నిర్మించాడు. అధికారం అండ ఉండడంతో కాలువ నిర్మాణంలోనే సుమారు 20 సెంట్ల మేర ఆర్‌అండ్‌బీ స్థలాన్ని తన భూమిలో కలిపేసుకున్నాడు. కొన్నాళ్లపాటు దాన్ని పట్టించుకోలేదు. ఇటీవల అక్కడ ఒక ట్రాక్టర్‌ షోరూం నిర్మించేందుకు ముందుగా తన భూమిలో నిర్మాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం మురుగు కాలువదాటి ఆర్‌అండ్‌బీ స్థలాన్ని కూడా ఆక్రమించేశాడు. నిర్మాణాలు పూర్తి చేస్తే తనను ఎవరూ పట్టించుకోరనే ధీమాతో హడావుడిగా పనులు చేస్తున్నాడు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్థిని వైసీపీ నాయకుడు కాజేస్తున్నా.., అధికార యంత్రాంగం మాత్రం చక్కగా జేబులు నింపుకొని చోద్యం చూస్తోంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆర్‌అండ్‌బీ స్థలంలో ఆక్రమణలు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:25 AM

Advertising
Advertising