ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఒంగోలు పార్లమెంట్‌కు ప్రత్యేక పోలీసు అబ్జర్వర్‌

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:42 PM

జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు పోలీసు అబ్జర్వర్‌గా ఐపీఎస్‌ అధికారి హసీబ్‌ ఉర్‌రెహమాన్‌ను నియమించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పోలీసు అబ్జర్వర్‌ ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో గురువారం రాత్రి సమావేశమయ్యారు.

సాయంత్రం 4 నుంచి 7 వరకు ఫోన్‌లో అందుబాటు

కలెక్టర్‌తో ప్రత్యేక సమావేశం

ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 25 : జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు పోలీసు అబ్జర్వర్‌గా ఐపీఎస్‌ అధికారి హసీబ్‌ ఉర్‌రెహమాన్‌ను నియమించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పోలీసు అబ్జర్వర్‌ ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో గురువారం రాత్రి సమావేశమయ్యారు. జిల్లాలోని పరిస్థితులను ఎస్పీ సుమిత్‌ సునీల్‌ వివరించారు. అబ్జర్వర్‌ హసీబ్‌ ఉర్‌రెహమాన్‌ మాట్లాడుతూ ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతవరణం కల్పించాలని పోలీసులకు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని అతిథిగృహంలో ఉంటానని, ఎవరైనా కలిసి తమ సమస్యలు చెప్పవచ్చని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శాంతి భద్రతల సమస్యలపై 9281034495 నంబర్‌లో చెప్పాలని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ కె.నాగేశ్వరరావు, అదనపు ఎస్పీ క్రైమ్స్‌ శ్రీధరరావు, ఏఆర్‌ అదనపు ఎస్పీ అశోక్‌బాబు డీఎస్పీలు అశోక్‌వర్ధన్‌, బాలసుందరరావు, కిషోర్‌బాబు, రామరాజు, సీహెచ్‌ శ్రీనివాసరావు, ఏఆర్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:42 PM

Advertising
Advertising