సత్తాచాటిన బల్లికురవ ఎడ్ల జత
ABN, Publish Date - May 20 , 2024 | 10:17 PM
సీఎస్‌పురం మండలం రామా పురం గ్రామంలో శ్రీ పట్టాభిరామ స్వామి దేవస్థాన తిరునాళ్ల సం దర్భంగా ఐదు జిల్లాల స్థాయిలో సో మవారం నిర్వహించిన ఎడ్ల బండ లాగుడు పోటీల్లో బల్లికురవకు చెందిన ఎడ్ల జత సత్తా చాటాయి. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం పావులూరి వీరాస్వామి చౌదరికి చెందిన ఎడ్ల జత 1589 అడుగులు లాగి ప్రథమ బహుమతి రూ. 50 వేలు నగదును కైవసం చేసుకున్నాయి.
సీఎస్‌పురం(పామూరు), మే 20: సీఎస్‌పురం మండలం రామా పురం గ్రామంలో శ్రీ పట్టాభిరామ స్వామి దేవస్థాన తిరునాళ్ల సం దర్భంగా ఐదు జిల్లాల స్థాయిలో సో మవారం నిర్వహించిన ఎడ్ల బండ లాగుడు పోటీల్లో బల్లికురవకు చెందిన ఎడ్ల జత సత్తా చాటాయి. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం పావులూరి వీరాస్వామి చౌదరికి చెందిన ఎడ్ల జత 1589 అడుగులు లాగి ప్రథమ బహుమతి రూ. 50 వేలు నగదును కైవసం చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మక్కెన కోటేశ్వరరావు ఎడ్లజత 1551.3 అడుగులు లాగి ద్వితీయ బహుమతి రూ.40 వేలు, గిద్దలూరు మండలం కొండపేట కు చెందిన మీనిగ కాశయ్య ఎడ్లజత 1157 అడుగులు లాగి తృతీయ బహుమతి రూ.30 వేలు పొందాయి.
అలాగే, పావూలూరి వీరస్వామిచౌదరికి చెందిన ఎడ్లజత 1023అడుగులు లాగగా ప్రోత్సహం కింద రూ.5 వేలు, నంద్యాల జిల్లా బేతంచర్ల గ్రామానికి చెందిన మేకల వెంట్రాయుడు ఎడ్లజత 927 అడుగులు లాగగా ప్రోత్సహం కింద రూ.5 వేలు నగదు బహుమతి అందజేశారు. ముందుగా ఈ పోటీలను అంబాల చినవెంకటరెడ్డి నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమాల్లో బహుమతుల దాతలు నారా పెద్దాసిద్ధారెడ్డి, చిన సిద్ధారెడ్డి, బాల సిద్ధారెడ్డి, సిద్ధారెడ్డి, దేవస్థాన నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2024 | 10:17 PM