గ్రామాల అభివృద్ధి కోసమే సభలు
ABN, Publish Date - Aug 24 , 2024 | 01:25 AM
గ్రామాల అభివృద్ధి కోసమే టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రామాల్లో సభలు నిర్వహి స్తోందని, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు.
బేస్తవారపేట, ఆగస్టు 23: గ్రామాల అభివృద్ధి కోసమే టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రామాల్లో సభలు నిర్వహి స్తోందని, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి రూ15కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాలను అన్నీ రంగాలలో ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులను పక్కదారి పట్టించా రన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే కేటాయిస్తోందన్నారు. ఉపాధి పథకం పక్కదారి పట్టకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఓసూరారెడ్డి, జడ్‌పీటీసీ సభ్యుడు బండ్లమూడి రాజయ్య, మట్టా రమేష్‌బాబు, కాజామియా, ఎంపీడీవో టి.పార్వతి, గ్రామసభల ప్రతేకాధికారి నరసింహారావు, పూనూరు భూపాల్‌రెడ్డి, టీడీపీ మండల అధక్షులు సోరెడ్డి మోహన్‌రెడ్డి, సాగర్, ఏపీడీ భాస్కర్ పాల్గొన్నారు.
గిద్దలూరు టౌన్ : గ్రామాల అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలో భాగంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు డివిజనల్ పంచాయతీ అధికారి, మండల స్పెషల్ ఆఫీసర్ వై.భాగ్యవతి అన్నారు. శుక్రవారం మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాలలో గ్రామసభలు నిర్వహిం చారు. గ్రామసభలలో జాతీయ ఉపాధిహామీ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరం చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఆమోదం కోసం గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ముండ్లపాడు, నరవ గ్రామసభలలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నిధులతో వివిధ శాఖల ద్వారా చేపట్టనున్న పనులను చదివి వినిపించి గ్రామసభ ఆమోదం తీసుకున్నారు. గ్రామసభల్లో ఎంపీడీవో హేమలతదేవి, విస్తరణాధికారి చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.
కంభం : ఐదేళ్లగా వైసీపీ పాలనలో దేశానికి పట్టు కొమ్మలైన దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలకు నిధుల కొరత వెంటాడింద టీడీపీ నాయకులైన ఎంపీటీసీ మాజీ సభ్యుడు అనీస్‌అహమ్మద్ కంభం మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు, టీడీపీ మైనారిటీ నాయకులు దాదా, తోట శ్రీనివాసులు, పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామాలకు పునర్వైభవం తీసుకొస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కంభంలో అభివృద్ధి పనులు చేపట్టలేదని, నాయకులు అధికారులను, కంభం సర్పంచ్, ఉపసర్పంచు లను ఈ సందర్భంగా ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, ఎంపీడీవో మస్తాన్‌వలి, ఉపాధి హామీ ఏపీవో ఏడుకొండలు పాల్గొన్నారు.
త్రిపురాంతకం : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనులను గుర్తించేందుకు మండలంలోని 24 పంచాయతీలలో గ్రామసభలను శుక్రవారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, టీడీపీ నాయకులు సభలకు హాజరై గ్రామాలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పనులపై చర్చించారు. కార్యక్రమాలలో తహసీల్దారు, ఎంపీడీవో, ఏపీవో, ఉపాదిహామీ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
పెద్దారవీడు : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుందని ఎంపీడీవో రాజ్‌కుమార్ అన్నారు. స్వర్ణ గ్రామపంచాయతీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రోడ్లవివరాలను వెల్లడించారు. ప్రజలకు అత్యవసరంగా కావాల్సిన సామాజిక పరమైన అంశాలపై వినతిపత్రాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గోకుల్ షెడ్లు అధిక మొత్తంలో కావాలని గ్రామస్థులు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ డి.చెన్నమ్మ, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఏఈ రమేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
పెద్ద దోర్నాల : గ్రామాల సమగ్రాభివృద్ధి కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి జగన్నాధరావు అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులపై నిర్వహిస్తున్న గ్రామ సభల్లో భాగంగా స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచి చిత్తూరి హారిక అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు.ఈ సంధర్భంగా ఆంఽద్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, మహాత్మగాంధీజీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగన్నాధరావు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సభలు నిర్వహిస్తు న్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ మాబు, గిరిజన సంఘం కో ఆర్డినేటర్ బీ మంతన్న ఎంపీడీవో నాసర్ రెడ్డి, డిప్యూటీ తహసీ ల్దారు సాలమ్మ, ఈవో మోహన్‌రావు, ఏపీఎం పోలయ్య, టీడీపీ నాయకులు డొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, బీజేపీ సీనియర్ నాయకులు సీతారెడ్డి, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తర్లుపాడు : మండలంలో గ్రామసర్పంచుల అధ్యక్షతన జరిగిన సభల్లో మొత్తం 16 పంచాయతీల్లో 764 వర్కులకు ఆమోదం వచ్చినట్లు ఎంపీడీవో ఎస్.నరసిం హులు తెలిపారు. 16 సీసీ రోడ్లకు రూ.3.27 కోట్లు, ఏడు సైడ్ కాలువల వర్కులకు రూ.2.60కోట్లు, 25 గోకులం షెడ్లకు రూ.57.50లక్షలు మొత్తం మండలంలో 764 వర్కు లకు రూ.16.53కోట్లకు గ్రామసభలో ఆమోదం తెలిపినట్లు ఆయన వివరించారు. తర్లుపాడులో రూ.96. 75లక్షలకు, కేతగుడిపిలో రూ.66లక్షలకు గ్రామసభల్లో ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామసభల్లో ప్రజలకు ఇచ్చిన అర్జీలు పరిశీలించి మరో సారి ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఖలీల్, ఏపీవో చిన్నకొండయ్య, ఏపీఎం డి.పిచ్చయ్య, ఎంఈవో డి.సుజాత, పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాసులరెడ్డి, ఎంఈవో-2 అచ్యుత సుబ్బారావు అధికారులు పాల్గొన్నారు.
మార్కాపురం రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని తహసీల్దార్ చిరంజీవి పేర్కొన్నారు. మండలంలోని బోడపాడులో శుక్ర వారం నిర్వహించిన గ్రామసభకు తహసీల్దార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామంలో పొలాలకు వెళ్లే రోడ్లు, రైతుల భూములలో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు బొగ్గు శేఖర్‌రెడ్డి, సర్పంచ్ రమణారెడ్డి, సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.
పుల్లలచెరువు : మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే పనులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకోవాలని పుల్లలచెరువు తహాసీల్ధారు నయీంఅహ్మద్ అన్నారు. శుక్రవారం చాపలమడుగులో ఉపాధి హామీ పనుల గుర్తింపు గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పధకం కింద గ్రామాల్లో సీసీ రోడ్డులు, మెటల్ రోడ్డులు నిర్మించవచ్చన్నారు. ఉపాధి పథకం ద్వారా రైతులు పండ్ల తోటల పెంపకం, నీటి కుంటలు, చెరువుల పూడిక తీత పనులు, రోడ్డుల వెంట చిల్లకంప తొలగింపు పనులు చేపట్టవచ్చన్నారు. కార్యక్రమంలో ఏపీవో శ్రీనివాసరెడ్డి, ఏపీఎం వెంకటయ్య, అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం : మండలంలోని మిల్లంపల్లి గ్రామ సభవేదిక వద్ద ప్రొటోకాల్ పాటించలేదని సర్పంచి ఏకుల జయమ్మ గ్రామసభను బాయ్‌కాట్ చేసి నిరసన తెలి పారు. టీడీపీ నాయకులను గ్రామ సభలకు ఆహ్వానిం చడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి రామారావునాయక్‌ను దీనిపై వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల ప్రకారం గ్రామ పెద్దలను కూడా సభలో భాగస్వాములను చేశామన్నారు. అనంతరం సర్పంచ్ జయమ్మ పంచాయతి కార్యాలయం ఎదుట ఆమె వర్గీయులతో కలసి నిరసన తెలిపారు.
ఎర్రగొండపాలెం : గ్రామసభలలో వచ్చిన విజ్ఞప్తులతో గ్రామపంచాయతీలను ఉపాధి నిధులతో అభివృద్ధి చేసుకుందామని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెం మేజరు గ్రామపంచాయతి ఆవరణలో శుక్రవారం ఉపసర్పంచి వి.గురవారెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. టీడీపీ ఇన్‌చార్జ్ మాట్లాడుతూ ఉపాధి నిధులు రూ.4500 కోట్లతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీని కోసం ఉపాధిహామీ పథకం ద్వారా 87 రకాల అభివృద్ధి సంక్షేమ పథకాల గుర్తింపనకు గ్రామసభలు నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలో 50లక్షల కుటుంబాలకు 9 కోట్లు పనిదినాలు కల్పించేందుకు ప్రభుత్వం తీర్మానించిందన్నారు. సర్పంచులు, అధికారులు సమష్టి నిర్ణయాలు తీసుకొని పంచాయతీలలో అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. గ్రామసభలో ఎంపీడీవో వై నాగేశ్వరప్రసాదు, ఉపాధిహామీపథకం టీఏ వెంకటరమణ, టీడీపీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు వేగినాటిశ్రీను, సచివాలయ ఉద్యోగులు, వార్డు సభ్యులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
Updated Date - Aug 24 , 2024 | 01:25 AM