తహసీల్దార్లకు నే డో, రేపో పోస్టింగ్‌లు
ABN, Publish Date - Jul 31 , 2024 | 01:08 AM
సార్వత్రిక ఎన్నికల్లో ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇక్కడ పనిచేస్తున్న ఇతర జిల్లాలకు చెందిన 34మంది తహసీల్దార్లను కలెక్టర్ రిలీవ్‌చేయగా, మన జిల్లాకు చెందిన తహసీల్దార్లు అక్కడ రిలీవ్ అయ్యారు.
జిల్లాలో 28 మంది రిపోర్టు
మరో ఆరుగురు రిలీవ్ కాని పరిస్థితి
ఒంగోలు (కలెక్టరేట్), జూలై 30: సార్వత్రిక ఎన్నికల్లో ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇక్కడ పనిచేస్తున్న ఇతర జిల్లాలకు చెందిన 34మంది తహసీల్దార్లను కలెక్టర్ రిలీవ్‌చేయగా, మన జిల్లాకు చెందిన తహసీల్దార్లు అక్కడ రిలీవ్ అయ్యారు. గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల నుంచి 34 మంది తహసీల్దార్లు మన జిల్లాకు రావాల్సి ఉంది. ఇప్పటివరకు 28 మంది తహసీల్లార్దు వచ్చారు. మరో ఆరుగురిని ఆయా జిల్లాల్లో ఇంకా రిలీవ్ చేయలేదు. ఇప్పటికే ఆయా మండలాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లను రిలీవ్ చేసి డిప్యూటీ తహసీల్దార్లకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. దీంతో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా దీనిపై దృష్టిసారించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పరిశీలన చేపట్టారు. అంతా పూర్తయ్యాక ఆ ఫైల్‌ను పరిశీలించి కలెక్టర్‌కు అందజేయనున్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళ, బుధవారాల్లో వారికి పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి వచ్చిన తహసీల్దార్లు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి రావాల్సిన ఆరుగురుని అక్కడ ఇంకా రిలీవ్ చేయలేదు. వారందరూ కలెక్టరేట్‌లోని పలు సెక్షన్లలో పనిచేస్తుండటంతో కొత్త తహసీల్దార్లు బాధ్యతలు స్వీకరించాక వారిని రిలీవ్ చేయనున్నట్లు సమాచారం. వారు వచ్చి ఇక్కడ రిపోర్టు చేసిన తర్వాత వారికి కూడా ఆయా మండలాల్లో తహసీల్దార్లుగా పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
Updated Date - Jul 31 , 2024 | 01:08 AM