ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిందితుడిని కఠినంగా శిక్షించాలని ర్యాలీ

ABN, Publish Date - Aug 24 , 2024 | 01:13 AM

కోల్‌కత్తాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని, స్థానిక బార్‌ అసోసియేషన్‌ సభ్యులు నిరసన ర్యాలీ చేపట్టారు.

గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 23 : కోల్‌కత్తాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని, స్థానిక బార్‌ అసోసియేషన్‌ సభ్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని గాంధీబొమ్మ కూడలిలో గాంధీమహాత్మునికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ వైద్యవృత్తి ఎంతో విలువైనదన్నారు. కరోనా సమయంలో వైద్యులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రోగులను కాపాడారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు పని ప్రదేశాలలో భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అత్యాచారం, హత్య చేసిన కేసులపై త్వరగా దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు సుమోటాగా కేసునమోదు చేసిందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు శేషశైనారెడ్డి, సంగీతరావు, హజరాంభీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 01:14 AM

Advertising
Advertising
<